Rahul Dravid: ‘రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇస్తేనే సరైన గౌరవం’: మాజీ క్రికెటర్

|

Jul 08, 2024 | 8:49 AM

టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే అతని కోచింగ్‌లో టీమ్ ఇండియా అజేయంగా నిలుస్తూ T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇస్తేనే సరైన గౌరవం: మాజీ క్రికెటర్
Rahul Dravid
Follow us on

టీ20 ప్రపంచకప్ 2024తో టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ చివరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే అతని కోచింగ్‌లో టీమ్ ఇండియా అజేయంగా నిలుస్తూ T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అంతేకాదు రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో టీమిండియా వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఆడింది. అంతకు ముందు ప్లేయర్ గా, కెప్టెన్ గా భారత్ కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు దివాల్. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌ను భారతరత్నతో సత్కరించాలని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోరుతున్నాడు. 2007, 2011 ప్రపంచకప్‌ల తర్వాత 2013లో టీమ్‌ఇండియా ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత గత 11 ఏళ్లుగా జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయింది. అయితే 2022లో రాహుల్ ద్రవిడ్ కోచ్ అయ్యాక అంతా మారిపోయింది. ఇప్పుడు టీ20 క్రికెట్‌లో ఛాంపియన్‌గానూ, టెస్టు, వన్డే క్రికెట్‌ వరల్డ్ కప్ ఫైనల్స్ లో రన్నరప్‌గానూ నిలిచింది.

ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌కు కోచ్‌గానే కాకుండా విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత క్రికెట్ కు అమూల్యమైన సేవలు అందించారని, అతనికి తప్పకుండా భారతరత్న పురస్కారం దక్కాలంటున్నాడు సునీల్ గవాస్కర్. ‘ రాహుల్ ద్రవిడ్ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. ప్లేయర్‌గా ద్రవిడ్ జట్టు కోసం ఎన్నో కష్టతరమైన మ్యాచ్‌లు గెలిపించాడు, కెప్టెన్‌గా జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవడం కష్టంగా ఉన్నప్పుడు విదేశీ గడ్డపై సిరీస్‌లను గెలుచుకునేలా జట్టును నడిపించాడు. ఇప్పుడు కోచ్‌గా కూడా ద్రావిడ్ నిరూపించుకున్నాడు. రాహుల్ ద్రవిడ్‌కు భారతరత్న ఇవ్వడానికి ప్రభుత్వం ఇదే సరైన సమయం’ అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ ద్రవిడ్ భారత్ తరఫున 164 టెస్టు మ్యాచ్‌లు ఆడి 13288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు, 63 అర్ధసెంచరీలు ఉండగా, 5 డబుల్ సెంచరీలు కూడా సాధించాడు. అలాగే, అతను 344 వన్డేల్లో 10889 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే భారత్ తరఫున 1 టీ20 మ్యాచ్ మాత్రమే ఆడిన ద్రవిడ్, అందులో 31 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..