Asia Cup 2023: ‘పాకిస్తాన్ వద్దు.. ఆ దేశమే ముద్దు.. మధ్యలో ఈ యూఏఈ గొడవేంది’: భారత స్టార్ ప్లేయర్..

India vs Pakistan: ఆసియా కప్ 2023 ఆతిథ్యానికి సంబంధించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదాలు మరలా మొదలయ్యాయి. ఆసియా కప్‌ను ఎలాగైనా నిర్వహించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. అదే సమయంలో..

Asia Cup 2023: పాకిస్తాన్ వద్దు.. ఆ దేశమే ముద్దు.. మధ్యలో ఈ యూఏఈ గొడవేంది: భారత స్టార్ ప్లేయర్..
Team India

Updated on: Feb 07, 2023 | 5:51 PM

Asia Cup 2023 Hosting Rights: ఆసియా కప్ 2023 ఆతిథ్యానికి సంబంధించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదాలు మరలా మొదలయ్యాయి. ఆసియా కప్‌ను ఎలాగైనా నిర్వహించాలని పాకిస్తాన్ కోరుకుంటోంది. అదే సమయంలో, ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహిస్తే, ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు భాగం కాదని బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో కూడా దీనిపై ఎలాంటి ముగింపు రాలేదు. దీంతో ఇరు దేశాల ఆటగాళ్లు కూడా ఈ వివాదంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. మరింత హీట్ పెంచుతున్నారు. దీంతో అసలు ఆసియాకప్ జరుగుతుందా లేదా, ఒకవేళ జరిగితే ఒక్కడ జరుగుతుందనే విషయాలపై ఆసక్తి నెలకొంది. వీటన్నింటి మధ్య, టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, ‘పాకిస్తాన్ ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వడం దాదాపు ఖాయమైంది. కానీ, బీసీసీఐ మాత్రం ‘పాకిస్తాన్‌లో ఆసియాకప్ జరిగితే, మేం పాల్గొనం. కచ్చితంగా నిర్వహించాలని అనుకుంటే వేదికను మార్చవలసి’ ఉంటుందని ప్రకటించిందంటూ చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై ఇరుదేశాలతోపాటు మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలు కూడా మరింత ఉద్రిక్తతను పెంచుతున్నాయి.

ఇదే విషయంపై అశ్విన్ మాట్లాడుతూ, ‘పాకిస్థాన్ ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వలేదని నేను భావిస్తున్నాను. శ్రీలంకకు తరలిస్తే బాగుంటుంది. 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఇది ముఖ్యమైన టోర్నమెంట్. ఏది ఏమైనా దుబాయ్‌లో చాలా టోర్నీలు జరిగాయి. అటువంటి పరిస్థితిలో అది శ్రీలంకకు మారితే, నేను చాలా సంతోషిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఆసియా కప్‌ యూఏఈ తరలనుందా..

ఆసియా కప్ 2023కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వాలని ఏసీసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది అక్టోబర్‌లో బీసీసీఐ సెక్రటరీ జై షా భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదని స్పష్టం చేశారు. ఆ తర్వాత, ఆసియా కప్ 2023 ఆతిథ్యంపై వివాదం చెలరేగింది. ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంపై వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ స్టాండ్ తర్వాత యూఏఈలో ఆసియా కప్ నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..