యువ సంచలనం శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)పై ప్రశంసలు కురిపించారు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్(Sunil Gavaskar,). అయ్యార్ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడని చెప్పాడు. గత సంవత్సరం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన సెంచరీ చేసినప్పటి నుంచి అయ్యర్ విశ్వాసం పెరిగిందన్నాడు. “శ్రేయాస్ అయ్యర్ దక్షిణాఫ్రికా(South Africa Tour) సిరీస్‌లో ఆడలేదు. అప్పుడు అతను వంద శాతం ఫిట్‌గా లేడు. అందుకే అతను ఎంపిక కాలేదని” స్టార్ స్పోర్ట్స్‌పై జరిగిన చర్చలో గవాస్కర్ అన్నారు. అయితే గవాస్కర్ జట్టు మేనేజ్‌మెంట్ చూసే ఒక పాయింట్‌ను హైలైట్ చేశాడు. అతని బ్యాటింగ్ స్థానాన్ని క్రమబద్ధీకరించండని కోరాడు.
“కానీ న్యూజిలాండ్‌తో జరిగిన ఆ రెండు టెస్టు మ్యాచ్‌లలో అతను ప్రదర్శించిన ప్రదర్శనతో ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. అతన్ని ఏ స్థానంల ఆడించబోతున్నారనేదే ప్రశ్నగా మిగిలిందన్నారు. అతను మూడు లేదా 5వ స్థానంలో రాబోతున్నాడు. ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తుంది” అని అన్నారు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌లలో అయ్యర్ 57 నాటౌట్, 74 నాటౌట్, 73 నాటౌట్‌గా నిలిచారు. ప్రస్తుతం అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మార్చి 4 నుంచి మొహాలీలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 100వ టెస్టు ఆడుతున్నందున మొహాలీ టెస్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రెండో టెస్టు మ్యాచ్ మార్చి 12న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Read Also.. Virat Kohli: మొదటిసారిగా కోహ్లీ పేరు అప్పుడే విన్నా.. 100వ టెస్ట్‌కు ముందు విరాట్‌కు సచిన్ సందేశం..