క్రికెట్ టీంపై దొంగల దాడి.. డబ్బుతోపాటు వాటిని కూడా తీసుకెళ్లారంటూ కీపర్ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

|

Oct 05, 2021 | 12:26 PM

దొంగలు క్రికెట్ జట్టు ఆటగాళ్ల వస్తువులతోపాటు నగదును తీసుకుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. క్రికెట్ జట్టు వ్యాన్‌ను దోచుకున్న దొంగలు శుభ్రంగా ఊడ్చుకుపోయారంట.

క్రికెట్ టీంపై దొంగల దాడి.. డబ్బుతోపాటు వాటిని కూడా తీసుకెళ్లారంటూ కీపర్ ఆవేదన.. అసలేం జరిగిందంటే?
Queensland Cricket Team
Follow us on

దొంగలు క్రికెట్ జట్టు ఆటగాళ్ల వస్తువులతోపాటు నగదును తీసుకుకెళ్లిన ఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. క్రికెట్ జట్టు వ్యాన్‌ను దోచుకున్న దొంగలు శుభ్రంగా ఊడ్చుకుపోయారంట. కారు హోటల్ బయట పార్క్ చేశారు. ఈ సమయంలో దొంగలు తమ చేతి వాటం చూపించి అంతా దోచుకపోయారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో జరిగింది. షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో భాగంగా క్వీన్స్‌ల్యాండ్ ఆడుతోంది. ఈ టోర్నీలో భాగంగా టాస్మానియాతో జరిగిన మ్యాచ్ కోసం అడిలైడ్‌ చేరుకుంది. గురువారం నుంచి టాస్మానియా వర్సెస్ క్వీన్స్‌ల్యాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీనికి ముందు క్వీన్స్‌లాండ్ టీం పలు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అసలు మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరగాల్సి ఉంది. కానీ, అక్కడ కరోనా కేసులు పెరుగుతుండడంతో మ్యాచ్‌ను అడిలైడ్‌కు మార్చారు. ఇక్కడ ఇలా ఈ జట్టు వస్తువులలతో పాటు నగదు అపహరణకు గురయ్యాయి.

సమాచారం ప్రకారం, టీం హోటల్ వెలుపల ఆగి ఉన్న వ్యాన్ గ్లాస్ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. కొంతమంది ఆటగాళ్ల వస్తువులను దొంగిలించారు. క్వీన్స్‌లాండ్ వికెట్ కీపర్ జిమ్మీ పియర్సన్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీని గురించి సమాచారం ఇచ్చారు. ఈమేరకు అడిలైడ్ చుట్టూ రెండు సరికొత్త గ్యారీ నికెల్స్ స్టిక్కర్ బ్యాట్‌లను ఎవరైనా చూస్తే, దయచేసి నాకు తెలియజేయండి అంటూ రాసుకొచ్చాడు. ఈ విషయమై దక్షిణ ఆస్ట్రేలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోటల్‌లోని సీసీ కెమెరాల ద్వారా పోలీసులు ఈ ఘటన మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నారు.

క్వీన్స్‌ల్యాండ్ వర్సెస్ టాస్మానియా మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 30 నుంచి బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో జరగాల్సి ఉంది. కానీ, నాలుగు కొత్త కరోనా కేసులు వచ్చిన తరువాత, మ్యాచ్ వాయిదా పడింది. దీని తరువాత టాస్మానియా బృందం వారి ఇంటికి తిరిగి వచ్చింది. దీని తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త షెడ్యూల్ రూపొందించి మ్యాచ్‌ను అడిలైడ్‌కు మార్చింది. ఈ మ్యాచ్ తర్వాత, టాస్మానియా అక్టోబర్ 17 నుంచి 20 వరకు పెర్త్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఇంతలో, విక్టోరియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య మ్యాచ్ అనుమానంగా మారింది. మెల్‌బోర్న్, సిడ్నీలలో కరోనా కేసులు రావడంతో, మ్యాచ్ కష్టంగా మారింది. న్యూ సౌత్ వేల్స్ సోమవారం అడిలైడ్‌కు వెళ్లి అక్కడ 14 రోజులు నిర్బంధంలో ఉంది. కానీ, ప్రస్తుతం వారి వస్తువులన్నీ అపహరణకు గురయ్యాయి. దీని పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.

Also Read: Shimron Hetmyer: మ్యాచ్ గెలిపించానోచ్.. బ్రావో భుజాలపైకి ఎక్కి సంతోషాన్ని పంచుకున్న హెట్‌మేయిర్.. వైరలవుతోన్న వీడియో

Ziva Dhoni: మా నాన్న టీమే గెలవాలి.. క్యూట్‌గా ప్రార్థిస్తున్న ధోని కూమార్తె.. ఫిదా అవుతోన్న నెటిజన్లు..!