Lucknow Super Giants vs Punjab Kings, 13th Match: ఐపీఎల్ (IPL) 2025లో భాగంగా 13వ మ్యాచ్ లక్నోలోని ఏకనా (అటల్ బిహారీ వాజ్‌పేయి) స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతోంది. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ స్థానంలో లాకీ ఫెర్గూసన్‌కు జట్టు అవకాశం ఇచ్చింది. మరోవైపు, లక్నో గత మ్యాచ్ ప్లేయింగ్-11లో ఎటువంటి మార్పులు చేయలేదు.
ఈ సీజన్‌లో రెండు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. 18వ సీజన్‌లో లక్నోకి ఇది మూడవ మ్యాచ్. పంజాబ్‌కి రెండవ మ్యాచ్. పంజాబ్ తన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. అదే సమయంలో, లక్నో తన మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో లక్నో జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచింది.
ఐపీఎల్ చరిత్రలో ఇది స్పెషల్ మ్యాచ్‌గా మారింది. అందుకుగల కారణం ఏంటంటే.. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు), శ్రేయాస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు)లు అత్యధిక ప్రైజ్ దక్కించుకున్నారు. ఈ ఇద్దరు కెప్టెన్లుగా తమ జట్లను ముందుడి నడిపిస్తున్నారు. మరి ఈ పోరు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ప్లేయింగ్-11..
🚨 Toss 🚨@PunjabKingsIPL won the toss and elected to bowl first against @LucknowIPL
Updates ▶️ https://t.co/j3IRkQFZpI#TATAIPL | #LSGvPBKS pic.twitter.com/DVuoMtnnop
— IndianPremierLeague (@IPL) April 1, 2025
పంజాబ్ కింగ్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్/జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నేహాల్ వధేరా/అజ్మతుల్లా ఒమర్జాయ్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జన్‌సెన్, అర్ష్‌దీప్‌షాల్, విజయ్‌కుమార్ చాహల్.
లక్నో సూపర్‌జెయింట్స్: రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్, ఎం సిద్ధార్థ్.
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రిన్స్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్, షాబాజ్ అహ్మద్, హిమ్మత్ సింగ్, ఆకాష్ మహరాజ్ సింగ్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: ప్రవీణ్ దూబే, విజయ్‌కుమార్ వైషాక్, నెహాల్ వధేరా, విష్ణు వినోద్, హర్‌ప్రీత్ బ్రార్.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..