SRH vs PBKS IPL Match Result: ప్లేఆఫ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపని మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం నమోదు చేసుకుంది. టీ20 టోర్నీ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. హైదరాబాద్ ఇచ్చిన 157 పరులు లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగా చేధించింది. 15.1 ఓవర్లలోనే కేవలం 5 వికెట్ల నష్టపోయి విజయాన్ని అందుకుంది. లియామ్ లివింగ్‌స్టోన్ (49*), శిఖర్ ధావన్ (39), జానీ బెయిర్‌స్టో (23), షారుఖ్ ఖాన్ (19), జితేశ్ శర్మ (19)తో రాణించారు. చేజింగ్‌లో కీలక పాత్ర పోషించిన లియామ్‌స్టోన్ ఇచ్చిన నాలుగు క్యాచ్‌లను హైదరాబాద్ ఫీల్డర్లు చేజార్చారు. ఇది పంజాబ్ విజయానికి ఒక రకంగా కారణంగా మారిందని చెప్పొచ్చు.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (43), రోమరియో షెపర్డ్ (26), వాషింగ్టన్ సుందర్ (25), మార్‌క్రమ్ (21), త్రిపాథి (20) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్స్‌లో నాథన్ ఎల్లిస్, హర్పీత్ బ్రార్ చేరో మూడు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ తక్కువ స్కోర్‌కే పరిమితం కావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో పంజాబ్ టోర్నీని ముగించింది.
మరిన్ని ఐపీఎల్ కథనాల కోసం క్లిక్ చేయండి..