WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. డబ్ల్యూపీఎల్ కంటే దారుణమా.. పాక్ సారథి కంటే ఈ 15 భారత ఆటగాళ్ళే మిలినీయర్లు..

| Edited By: Venkata Chari

Feb 14, 2023 | 4:38 PM

WPL Auction 2023: మంగళవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) మొదటి వేలంలో ఆటగాళ్లపై భారీగా డబ్బుల వర్షం కురిసింది.

WPL vs PSL: ఇదేందయ్యా ఆజామూ.. డబ్ల్యూపీఎల్ కంటే దారుణమా.. పాక్ సారథి కంటే ఈ 15 భారత ఆటగాళ్ళే మిలినీయర్లు..
Wpl Vs Psl
Follow us on

WPL Auction 2023: మంగళవారం (ఫిబ్రవరి 13) జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) మొదటి వేలంలో ఆటగాళ్లపై భారీగా డబ్బుల వర్షం కురిసింది. 5 ఫ్రాంచైజీ జట్లు 87 మంది ఆటగాళ్లపై మొత్తం రూ.59.50 కోట్లు వెచ్చించాయి. ఇక్కడ 20 మంది ఆటగాళ్లు కోటి కంటే ఎక్కువ రాబట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ 20 మంది ఆటగాళ్లలో 15 మంది ఆటగాళ్ల జీతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ధరను పొందిన బాబర్ అజామ్ కంటే ఎక్కువగా ఉండడం గమానార్హం.

పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధిక జీతం ప్లాటినం కేటగిరీలోని ఆటగాళ్లకు ఇస్తుంటారు. ఈ కేటగిరీలోని ఆటగాళ్లు గరిష్టంగా $1.7 లక్షల (రూ. 1.40 కోట్లు) వరకు జీతం పొందుతారు. షాహీన్ అఫ్రిది, రిజ్వాన్ వంటి చాలా మంది పెద్ద ఆటగాళ్లు బాబర్ ఆజంతో సహా ఈ విభాగంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మహిళల ప్రీమియర్ లీగ్ వేలం మొదటిసారి జరిగింది. 15 మంది ప్లేయర్ల ధర పాకిస్తాన్ ఆటగాళ్ల గరిష్ట పరిమితిని దాటింది. స్మృతి మంధాన, యాష్లే గార్డనర్, నటాలీ సీవర్‌లు బాబర్ అజామ్ జీతం కంటే రెండున్నర రెట్లు ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లుగా నిలిచారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.

బాబర్ జీతం కంటే ఎక్కువ పొంరిన డబ్ల్యూపీఎల్ ఆటగాళ్లు..

1. స్మృతి మంధాన (భారత బ్యాట్స్‌మెన్): రూ. 3.40 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

2. ఆష్లే గార్డనర్ (ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్): రూ. 3.20 కోట్లు (గుజరాత్ జెయింట్స్)

3. నటాలీ సీవర్ (గుజరాత్ గెయింట్స్) ఇంగ్లీష్ ఆల్‌రౌండర్: రూ. 3.20 కోట్లు (ముంబై ఇండియన్స్)

4. దీప్తి శర్మ (భారత ఆల్ రౌండర్): రూ. 2.60 కోట్లు (యూపీ వారియర్స్)

5. జెమిమా రోడ్రిగ్స్ (భారత బ్యాట్స్‌మన్): రూ. 2.20 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

6. బెత్ మూనీ (ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్) బ్యాట్స్‌మన్): రూ. 2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)

7. షఫాలీ వర్మ (భారత బ్యాట్స్‌మన్): రూ. 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

8. పూజా వస్త్రాకర్ (భారత ఆల్ రౌండర్): రూ. 1.90 కోట్లు (ముంబయి ఇండియన్స్)

9. రిచా ఘోష్ (భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్) ): రూ 1.90 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

10. సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లీష్ ఆల్ రౌండర్): రూ. 1.80 కోట్లు (యూపీ వారియర్స్)

11. హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత ఆల్ రౌండర్): రూ. 1.80 కోట్లు (ముంబై ఇండియన్స్)

12. ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్): రూ. 1.70 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

13. రేణుకా సింగ్ (భారత బౌలర్): రూ. 1.50 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

14. యాస్తికా భాటియా (భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్): రూ. 1.50 కోట్లు (ముంబై ఇండియన్స్)

15. మరిజానే కాప్ (సౌత్ ఆఫ్రికన్ ఆల్-రౌండర్): రూ. 1.50 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..