Pooja Vastrakar: మైదానంలో వికెట్ల వర్షం.. వేలంలో కాసుల వర్షం.. ఆల్‌రౌండర్‌ పూజ కోసం ఎన్నికోట్లు వెచ్చించారంటే?

|

Feb 13, 2023 | 9:59 PM

మేటి ఆల్‌రౌండర్‌గా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న పూజా వస్త్రాకర్‌ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది.

Pooja Vastrakar: మైదానంలో వికెట్ల వర్షం.. వేలంలో కాసుల వర్షం.. ఆల్‌రౌండర్‌ పూజ కోసం ఎన్నికోట్లు వెచ్చించారంటే?
Pooja Vastrakar
Follow us on

ముంబై వేదికగా జరుగుతోన్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. బై జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఉమెన్స్‌ ప్రీమియర్‌లీగ్‌ వేలంలో సుమారు 409 మంది మహిళా క్రికెటర్లు తమ అదృష్టం పరీక్షించుకున్నారు. ముంబై, యూపీ, బెంగళూరు, గుజరాత్‌, ఢిల్లీ ప్రాంఛైజీలు ఈ వేలంలో పాల్గొన్నాయి.  90 మంది క్రికెటర్ల కోసం ప్రాంఛైజీలు పోటీపడ్డాయి. ప్రధానంగా బ్యాటర్స్‌, బౌలర్స్‌, ఆలౌరౌండర్స్‌ కోసం ఫ్రాంఛైజీల మధ్య పోటాపోటీగా వేలంపాట కొనసాగింది. దేశీయ ప్లేయర్లనే కాదు, విదేశీ మహిళ క్రికెటర్లను దక్కించుకోవడం కోసం యాక్షన్‌ కొనసాగింది. ఈ ఆక్షన్‌లో టీమిండియా మహిళా క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇక మేటి ఆల్‌రౌండర్‌గా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న పూజా వస్త్రాకర్‌ను ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.1.9 కోట్లు వెచ్చించింది.

ఇక స్టార్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, దీప్తిశర్మ పై కాసుల వర్షం కురిసింది.  స్మతి మందానను వేలంపాటలో బెంగళూరు ప్రాంఛైజీ 3.4 కోట్లకు దక్కించుకుంది. అటు దీప్తిశర్మను యూపీ 2.60 కోట్లకు కొనుగోలు చేయగా, జెమీమా రోడ్రిగ్స్‌ను 2.20 కోట్లు, షెఫాలీ వర్మ-రూ.2 కోట్ల రూపాయలకు ఢిల్లీ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఇక మిడిలాడర్‌ బ్యాటర్‌, బౌలర్లను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాయి ప్రాంఛైజీలు.  యస్తికా భాటియా-రూ.1.50 కోట్లు, హర్మన్‌ ప్రీత్‌కౌర్‌-రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ప్రాంఛైజీ. ఇక రిచా గోష్‌-రూ.1.90 కోట్లు, రేణుకాసింగ్‌ ఠాకూర్‌-రూ.1.50 కోట్లకు బెంగళూరు ప్రాంఛైజీ కొనుగోలు చేసింది. హర్లీన్‌ డియోల్‌ను గుజరాత్‌ జట్టు 40 లక్షలకు కొనుగోలు చేసింది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..