అటు పురుషులు.. ఇటు మహిళలు.. ప్రపంచకప్ గెలిచినా ట్రోఫీని తాకని ప్రధాని మోదీ.. కారణం తెలిస్తే

PM Narendra Modi did not touch the ICC Womens World Cup 2025 Trophy: ప్రపంచ కప్‌ను సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుతో కలిసి ప్రధాని మోదీ ఫొటో దిగారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన మధ్య ప్రధాని నిలబడి ఉండగా, ట్రోఫీ కూడా వారి ముందు ఉంది. అయితే, ఈ ఫొటోలో ప్రధాని మోదీ ట్రోఫీని తన చేతులతో అస్సలు తాకలేదు. ఈ చర్య అనేక మంది దృష్టిని ఆకర్షించింది.

అటు పురుషులు.. ఇటు మహిళలు.. ప్రపంచకప్ గెలిచినా ట్రోఫీని తాకని ప్రధాని మోదీ.. కారణం తెలిస్తే
Pm Modi Meets Team India

Updated on: Nov 06, 2025 | 8:06 AM

PM Narendra Modi did not touch the ICC Womens World Cup 2025 Trophy: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఢిల్లీలో తన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన ‘నారీశక్తి’ని ప్రధాని అభినందించారు. అయితే, ఈ సన్మాన కార్యక్రమం సందర్భంగా తీసిన ఒక ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో విశేషంగా ప్రశంసలు అందుకుంటోంది. దానికి కారణం, ఆ ఫొటోలో ప్రధాని మోదీ ప్రదర్శించిన నిజమైన క్రీడా స్ఫూర్తి, క్రీడాకారుల పట్ల ఆయనకున్న గౌరవం.

ప్రపంచ కప్‌ను సాధించిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టుతో కలిసి ప్రధాని మోదీ ఫొటో దిగారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్-కెప్టెన్ స్మృతి మంధాన మధ్య ప్రధాని నిలబడి ఉండగా, ట్రోఫీ కూడా వారి ముందు ఉంది. అయితే, ఈ ఫొటోలో ప్రధాని మోదీ ట్రోఫీని తన చేతులతో అస్సలు తాకలేదు. ఈ చర్య అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఇందుకు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది.

ఇవి కూడా చదవండి

ట్రోఫీని తాకకపోవడానికి గల కారణం..

సాధారణంగా, ప్రపంచ కప్ లేదా ఇటువంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో విజయం సాధించిన ట్రోఫీని తమ రక్తంతో, చెమటతో కష్టపడి గెలుచుకున్న క్రీడాకారులు మాత్రమే తాకాలి అనే ఒక సంప్రదాయం ఉంది. ఇతరులు ట్రోఫీని తాకకుండా, ఈ విజయం సంపూర్ణ గౌరవాన్ని పూర్తిగా క్రీడాకారులకే ఇవ్వడం ఈ సంప్రదాయం వెనుక ఉన్న కీలక ఉద్దేశం.

ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ, క్రీడాకారుల అద్భుతమైన కృషిని, వారి పట్టుదలను గౌరవిస్తూ ట్రోఫీని తాకకుండా నిలబడటం అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ చర్య ద్వారా, ప్రధాని మోదీ ప్రపంచకప్ విజయానికి పూర్తి ఘనత జట్టుకే చెందుతుందని, వారి కష్టానికి ఆయన ఎంతటి విలువ ఇస్తున్నారో నిరూపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదని గమనించాలి. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, భారత జట్టు వెస్టిండీస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరింది. జట్టు ఫొటో సమయంలో జట్టు ప్రధాని మోడీని కలిసింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి నిలబడ్డారు. అయితే, ప్రధాని మోడీ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని తాకలేదు.

భారత జట్టుకు చారిత్రాత్మక క్షణం..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడం భారతదేశానికి ఒక కల లాంటిది కాదు. ఈ టోర్నమెంట్ 1973 లో ప్రారంభమైంది. కానీ భారత జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. రెండుసార్లు ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, ట్రోఫీని గెలుచుకోలేకపోయింది. అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలో, భారత జట్టు చివరకు 47 సంవత్సరాల నిరీక్షణకు ముగింపు పలికింది. టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ఆస్ట్రేలియాను కూడా సెమీ-ఫైనల్స్‌లో ఓడించింది. 2017 తర్వాత తొలి వన్డే ప్రపంచ కప్ ఓటమిని ఆసీస్ జట్టు చవి చూడాల్సి వచ్చింది.