Khelo India Games: ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ.. ఖేలో ఇండియా ఆటగాళ్లకు ప్రత్యేక వీడియో సందేశం..

|

Apr 24, 2022 | 8:25 PM

ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2022(Khelo India University games 2022) ఏప్రిల్ 24 ఆదివారం నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ క్రీడలను ప్రారంభించారు.

Khelo India Games: ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని మోదీ.. ఖేలో ఇండియా ఆటగాళ్లకు ప్రత్యేక వీడియో సందేశం..
Pm Narendra Modi
Follow us on

భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi) ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఖేలో ఇండియా క్రీడలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రీడా సంబురాలను ప్రతి ఏటా నిర్వహిస్తోంది. 2022లో మొదలైన ఈ గేమ్స్.. 2021లో కరోనా కారణంగా నిర్వహించలేదు. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2022(Khelo India University games 2022) ఏప్రిల్ 24 ఆదివారం నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ క్రీడలను ప్రారంభించారు. ప్రారంభోత్స కారక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాలేదు. అయితే ఓ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా యువ క్రీడాకారులను ప్రోత్సహించి, మంచి ఆటతీరును కనబర్చాలని ఆకాంక్షించారు. దీనితో పాటు, ప్రధానమంత్రి ఆటగాళ్లకు టీమ్ స్పిరిట్ అనే మంత్రాన్ని కూడా అందించారు.

ఆదివారం ప్రారంభోత్సవ వేడుకలో ప్రధానమంత్రి ఈ వీడియో సందేశం ప్రసారమైంది. కరోనా మహమ్మారి సమయంలో ఈ ఆటలను నిర్వహించడం భారతీయ యువత స్ఫూర్తిని చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నో సవాళ్ల మధ్య, ఈ గేమ్ భారతదేశంలోని యువత సంకల్, అభిరుచికి ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు.

విజయ మంత్రం..

జీవితంలో విజయం సాధించేందుకు టీమ్ స్పిరిట్‌పై శ్రద్ధ వహించాలని యువ ఆటగాళ్లకు ప్రధాని మోదీ బోధించారు. ఈ గేమ్‌లలో ఆటగాళ్లందరూ మంచి అనుభవాన్ని పొందుతారని ప్రధాని అన్నారు.

ద్యూతీ-నటరాజ్ వంటి ఆటగాళ్లు కూడా..

ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ మొదట 2020లో ప్రారంభించారు. అయితే ఆ తర్వాత కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని ఆపివేసింది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆటలు నిర్వహించలేదు. ప్రస్తుతం యూనివర్శిటీ గేమ్స్‌ను 2022లో రెండో సీజన్‌ను నిర్వహిస్తున్నారు. అయితే, వీటిని 2021 సంవత్సరం పేరుతో మాత్రమే ఆడుతున్నారు. ఈసారి 3000 మందికి పైగా క్రీడాకారులు ఈ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. 20 విభిన్న క్రీడలలో, 189 విశ్వవిద్యాలయాల నుంచి క్రీడాకారులు రాబోయే 10 రోజుల పాటు పాల్గొంటారు. విశేషమేమిటంటే.. ఈసారి ద్యుతీ చంద్, శ్రీహరి నటరాజ్, దివ్యాన్ష్ పన్వర్, ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ వంటి క్రీడాకారులు కూడా ఇందులో పాల్గొంటున్నారు.

Also Read: IPL 2022: అభిమానుల మనుసు దోచుకున్న యూపీ వాలా.. కేవలం ఒక్క మ్యాచ్‌తో ‘సూపర్‌మ్యాన్’గా మారాడు.. అతనెవరంటే?

IPL 2022: విరాట్‌ కోహ్లీ నాలుగు లేదా ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయాలి.. భారత మాజీ ఆటగాడి సలహా..!