T20 World Cup 2022: కరోనా సోకినా టీ20 ప్రపంచకప్ ఆడొచ్చు.. ఐసీసీ కీలక ప్రకటన..

|

Oct 16, 2022 | 5:51 PM

ICC: కరోనా సోకిన ఆటగాళ్లు ఇకపై ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదంటూ ఐసీసీ కీలక ప్రకటన చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ 2022కు ఐసీసీ భారీ రాయితీ ఇచ్చినట్లైందని భావిస్తున్నారు.

T20 World Cup 2022: కరోనా సోకినా టీ20 ప్రపంచకప్ ఆడొచ్చు.. ఐసీసీ కీలక ప్రకటన..
T20 World Cup 2022
Follow us on

ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం ప్రారంభమైంది. ఈ టోర్నీలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చేసిన అతిపెద్ద మార్పులలో ఒకటి కరోనా ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన మార్పు కూడా ఆస్ట్రేలియాలో కనిపించనుంది. ఇంతకుముందు ఆటగాళ్లలో ఎవరికైనా కరోనా వస్తే.. అప్పటి నుంచి సదరు ప్లేయర్ నిర్దిష్ట రోజుల పాటు ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. అయితే, తాజాగా ఇందులో ఐసీసీ కీలక మార్పు చేసింది. కరోనా సోకిన ఆటగాళ్లు కూడా ప్రపంచకప్‌లో ఆడేందుకు అనుమతిస్తారని ప్రకటించింది.

2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్ సమయంలోనూ ICC కరోనా వచ్చినా ప్లేయర్లను ఆడేందుకు అనుమతించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ కోవిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పటికీ ఆడేందుకు ఐసీసీ ఓకే చెప్పింది. అయితే ఆమె మాస్క్‌తో విడిగా కూర్చోవడం కనిపించింది. ఆ తర్వాత బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఆమె జట్టు సభ్యలతో కలిసి సంబరాలు చేసుకుంది. పురుషుల ప్రపంచకప్‌లో కూడా ఇవే దృశ్యాలు కనిపించవచ్చు.

అలాగే, ఏ కోవిడ్ పాజిటివ్ ప్లేయర్‌కు ఐసోలేషన్ ఉండదని ఐసీసీ ప్రకటించింది. అలాగే, టోర్నమెంట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ పరీక్ష ఉండదని కూడా ప్రకటించింది. ఆటగాళ్ళు 2020 నుంచి లెక్కలేనన్ని COVID-19 పరీక్షలు చేయించుకున్నారు. దీంతో తాజాగా ప్రకటించిన మార్పులతో నమూనాలను ఇవ్వవలసిన అవసరం లేదు. COVID-19 పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడింది. ప్రజలు టీకాలు తీసుకోవడం ద్వారా ముప్పును కరోనాను విజయవంతంగా ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, 8వ టీ20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఈరోజు (అక్టోబర్ 16) గీలాంగ్‌లో జరిగింది. ఫైనల్ నవంబర్ 13 న ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగాల్సి ఉంది.

నవంబర్ 9, 10 తేదీల్లో వరుసగా సిడ్నీ, అడిలైడ్‌లలో రెండు సెమీఫైనల్‌లు జరుగుతాయి. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ MCGలో జరుగుతుంది.