ఐసీసీ కొత్త టీ20 ర్యాంకింగ్ జాబితాను ప్రచురించింది. బ్యాటర్ల జాబితాలో ఈసారి కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ ఏకంగా 88 స్థానాలు ఎగబాకి 2వ స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు ఫిల్ సాల్ట్ 90వ ర్యాంక్‌లో ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో 2 భారీ సెంచరీలతో మొత్తం 331 పరుగులు చేసిన సాల్ట్.. ఇప్పుడు టీ20 బ్యాటర్ల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నాడు. టీ20 బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఈ ఐపీఎల్ వేలంలో అసలు అమ్ముడుపోలేదు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడిన సాల్ట్ ఈసారి 1.5 కోట్ల తో ఐపీఎల్ పేరు నమోదు చేసుకున్నాడు. అయితే ఈ బేస్ ధరతో సాల్ట్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడైనా ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఈ ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్‌పై ఆసక్తి చూపిస్తాయో లేదో చూడాలి.
కాగా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే రషీద్ ఖాన్ రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా స్పిన్నర్ రవి బిష్ణోయ్ మూడో స్థానంలో నిలిచాడు. ఇక వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం మొదటి స్థానంలోకొనసాగుతున్నాడు. టీమిండియా ప్రిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ (3), రోహిత్ శర్మ (4), డేవిడ్ వార్నర్ (5) ఉన్నారు. టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ప్లేస్‌లో ఉండగా, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
📈 Massive jump of 16 spots for Phil Salt
💫 Reece Topley moves into the top 10
🏴 Big gains for spinnersLatest changes in the @MRFworldwide ICC Men’s Player Rankings 👇https://t.co/VC0r3aPqES
— ICC (@ICC) December 28, 2023
బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
Mind-blowing numbers 🤯
No player has ever scored more runs in a five-match Men’s T20I series than Phil Salt 🔥#WIvENG pic.twitter.com/8SE4b7jy3X
— ICC (@ICC) December 22, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..