Babar Azam: ‘ఇప్పుడు ఇవి అవసరమా?’.. పాక్ కెప్టెన్‌పై దుమ్మెత్తిపోస్తున్న పాక్ క్రికెట్ అభిమానులు.. ఏమంటున్నారంటే..?

|

May 25, 2023 | 6:51 PM

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌పై పాక్ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అందిందే అవకాశం అనుకున్నారో ఏమో కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల క్రికెటర్‌ని వాళ్లే ఎందుకు ట్రోల్ చేసుకుంటారు, ఇది నిజం కాదేమో..

Babar Azam: ‘ఇప్పుడు ఇవి అవసరమా?’.. పాక్ కెప్టెన్‌పై దుమ్మెత్తిపోస్తున్న పాక్ క్రికెట్ అభిమానులు.. ఏమంటున్నారంటే..?
Babar Azam Trolls
Follow us on

Babar Azam: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్‌పై పాక్ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అందిందే అవకాశం అనుకున్నారో ఏమో కానీ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల క్రికెటర్‌ని వాళ్లే ఎందుకు ట్రోల్ చేసుకుంటారు, ఇది నిజం కాదేమో అనిపిస్తుందేమో కానీ ఇది అక్షరాలా నిజం. అందుకు కారణం కూడా లేకపోలేదు. లాహోర్ పుర వీధుల్లో బాబర్ అజమ్ బీఎండ‌బ్ల్యూ బైక్ న‌డపడమే ఇందుకు కారణం. అవును, అందుకు సంబంధించిన వీడియోను కూడా బాబర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. కానీ దానిపై పాక్ క్రికెట్ అభిమానులు కొందరు విమర్శనాత్మకంగా కామెంట్లు చేస్తుండగా.. మరి కొందరు జాగ్రత్తలు చెప్తూ కామెంట్లు రాసుకొస్తున్నారు.

అసలు పాక్ క్రికెట్ అభిమానులు అలా ఎందుకు చేస్తున్నారంటే.. మరి కొన్ని వారాల్లో ఆసియా కప్, అలాగే 5 నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్నాయి. కానీ ఈ సమయంలో బాబర్ కాలయాపన చేస్తూ బైక్ మీద తిరుగుతున్నాడని, నెట్ ప్రాక్టీస్ చేసి దేశానికి ప్రపంచ కప్ అందించాలని బాబర్‌కి లేదని కొందరు నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

పెట్రోల్ కోసం డబ్బులను ఎక్కడ దొంగిలించావు..?

వరల్డ్ కప్‌కి ముందు బైక్ రైడింగ్స్ అవసరమా..?

ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ‘పెట్రోల్ కోసం డబ్బులను ఎక్కడ దొంగిలించావు..?’ అంటూ పాక్ కెప్టెన్‌ని అవమానిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు సానుకూలంగా  ‘‘జాగ్రత్తగా నడపరా బాబు.. పాక్ కప్ కొట్టాలంటే నువ్వే దిక్కు’’ అని కామెంట్ చేస్తుండగా.. ‘‘నువ్వు కింద పడ్డావంటే.. వరల్డ్ కప్ భారత్ చేతుల్లో పడడం ఖాయం’’ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇంకా కొందరు నెటిజన్లు అయితే.. వరల్డ్ కప్ గెలవాలంటే ఈ సమయం చాలా విలువైనది, కానీ టీమ్ కెప్టెన్‌కి ఏమి పట్టడంలేదు, ఎంతో బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..