Perth Scorchers vs Melbourne Renegades: ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL 2023) 15వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. పెర్త్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కాచర్స్ తలపడ్డాయి. మెల్‌బోర్న్ జట్టు కెప్టెన్ నిక్ మాడిసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన పెర్త్ స్కాచర్స్ జట్టుకు శుభారంభం లభించలేదు.
తొలి ఓవర్ 5వ బంతికి ఓపెనర్ జాక్ క్రాలీ (1), ఆ తర్వాత కూపర్ కొన్నోలీ (0) అవుటయ్యాడు. 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పెర్త్ స్కాచర్స్ జట్టును కెప్టెన్ ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్ ఆదుకున్నారు.
మూడో వికెట్‌కు హార్డీ (57), జోష్ ఇంగ్లిస్ (64) సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత లారీ ఎవాన్స్ 24 పరుగులు చేసింది. కాగా, జట్టు మొత్తం 150 పరుగుల మార్కును దాటింది.
16 ఓవర్లలో 155 పరుగుల మార్కును దాటిన పెర్త్ స్కాచర్స్ జట్టు భారీ స్కోర్ చేస్తుందని భావించారు. కానీ, డెత్ ఓవర్లలో మెరుపు బౌలింగ్ ఎటాక్ నిర్వహించిన మెల్ బోర్న్ రెనెగేడ్స్ బౌలర్లు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు పడగొట్టారు.
దీంతో పెర్త్ జట్టు 5 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. దీంతో పెర్త్ స్కాచర్స్ జట్టు 19.4 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది.
పెర్త్ స్కాటర్స్ ఇచ్చిన 163 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కు శుభారంభం అందినా మిడిల్ ఆర్డర్‌లో కుప్పకూలింది. 4వ ఆర్డర్‌లో షాన్ మార్ష్ 36 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 59 పరుగులు చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్‌లకు మద్దతు లభించలేదు. చివరకు మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పెర్త్ స్కాచర్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పెర్త్ స్కాచర్స్ ప్లేయింగ్ XI: కూపర్ కొన్నోలీ, జాచ్ క్రాలే, ఆరోన్ హార్డీ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), లారీ ఎవాన్స్, నిక్ హాబ్సన్, అష్టన్ అగర్, జే రిచర్డ్‌సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, లాన్స్ మోరిస్.
మెల్బోర్న్ రెనెగేడ్స్ ప్లేయింగ్ XI: జో క్లార్క్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, నిక్ మాడిన్సన్ (కెప్టెన్), షాన్ మార్ష్, జోనాథన్ వెల్స్, విల్ సదర్లాండ్, టామ్ రోజర్స్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, ముజీబ్ రెహమాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..