PCB: పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ వన్డే సిరీస్‌కి ఒప్పుకున్న తాలిబాన్లు..! సంచలన నిర్ణయం ప్రకటించిన పీసీబీ..

|

Aug 20, 2021 | 5:57 AM

PCB: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సంచలన నిర్ణయం ప్రకటించింది. అఫ్గనిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి తాలిబాన్లు ఒప్పుకున్నట్లు తెలిపింది.

PCB: పాకిస్తాన్‌, అఫ్గనిస్తాన్‌ వన్డే సిరీస్‌కి ఒప్పుకున్న తాలిబాన్లు..! సంచలన నిర్ణయం ప్రకటించిన పీసీబీ..
Pakistan Afghanistan Odi Se
Follow us on

PCB: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) సంచలన నిర్ణయం ప్రకటించింది. అఫ్గనిస్తాన్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కి తాలిబాన్లు ఒప్పుకున్నట్లు తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే సిరీస్‌ యధావిధిగా కొనసాగుతుందని తెలపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ సిరీస్‌ జరగడం అసాధ్యమని అంతా అనుకున్నారు. అయితే, సిరీస్‌ నిర్వహణకు తాలిబన్ల నుంచి అనూహ్యంగా మద్దతు లభించడంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం అవాక్కయ్యింది. కాగా, సెప్టెంబర్‌ 1 నుంచి 5 వరకు శ్రీలంకలోని హంబన్‌తోట వేదికగా పాక్‌, ఆఫ్గన్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగాల్సి ఉంది.

తాలిబన్లు మొదటి నుంచి క్రికెట్‌కు వ్యతిరేకులుగా ఉండటంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్లు పాల్గొనేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అఫ్గాన్‌లో నెల‌కొన్న అనిశ్చిత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆ దేశ క్రికెటర్ల భ‌విష్యత్తు గంద‌ర‌గోళంలో ప‌డింది. రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ లాంటి స్టార్‌ క్రికెటర్లైతే ఐపీఎల్‌ తదితర లీగ్‌ల్లో పాల్గొంటామని ఇదివరకే ప్రకటించారు. అయితే, మిగాతా అఫ్గాన్‌ జాతీయ క్రికటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. మరోవైపు అఫ్గానిస్తాన్‌ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో ముష్కరుల(తాలియన్ల) విధ్వంసకాండ చూసి అతను చలించిపోయాడు.

‘ఈరోజు అఫ్గానిస్థాన్‌ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయాన్ని కేటాయిద్దాం. దేశం కోసం చేసిన త్యాగాలను ఎప్పటికీ మరవలేము. శాంతియుత అఫ్గాన్‌ రాజ్య స్థాపన కోసం మనమందరం ప్రార్థిద్దాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాము’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా, ప్రస్తుతం తాలిబన్ల ఆక్రమణలతో ఉన్న దేశ ప్రజలు ఈసారి వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టగా, తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు.

KL Rahul: తగ్గేదే..లే ”మీరు ఒకరిని కవ్విస్తే.. 11 మంది తిరగపడతాం” రాహుల్ మాస్ వార్నింగ్ వైరల్.!

ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. దాయాదుల పోరుకు వేదిక ఖరారు..

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..