Punjab Kings vs Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ధర్మశాల మైదానంలో జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ ముందు 188 పరుగుల టార్గెట్ నిలిచింది.
జితేష్ శర్మ 44 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, సామ్ కరణ్ 31 బంతుల్లో 49 పరుగులు చేశాడు. రాజస్థాన్ తరపున నవదీప్ సైనీ 3 వికెట్లు తీశాడు. ధర్మశాల మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
సామ్-షారుక్ మధ్య 50+ భాగస్వామ్యం..
జితేష్ శర్మ అవుట్ అయిన తర్వాత, చివరి ఓవర్లలో సామ్ కరణ్, షారూఖ్ ఖాన్ మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యం జట్టు స్కోరును 190కి చేరువ చేసింది. ఇద్దరూ 37 బంతుల్లో అజేయంగా 73 పరుగులు జోడించారు.
జితేష్-సామ్ కీలక భాగస్వామ్యం..
50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత, జితేష్ శర్మ, సామ్ కరణ్ పంజాబ్‌ను హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో పంజాబ్ కింగ్స్ టీంకు కీలక భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. జితేష్ శర్మను ఔట్ చేయడం ద్వారా నవదీప్ సైనీ ఈ జోడీకి బ్రేక్ వేశాడు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..