Punjab Kings vs Rajasthan Royals Playing XI & Imapct Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈరోజు లీగ్ దశలో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరుగుతోంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయనుంది. కాగా, ధర్మశాల మైదానంలో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నాయి.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఆరు గెలిచి, ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు 12 పాయింట్లతో ఉంది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచింది. 7 ఓడిపోయింది. జట్టుకు 12 పాయింట్లు ఉన్నాయి.
పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఇప్పటివరకు మొత్తం 25 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్, 11 మ్యాచుల్లో పంజాబ్ విజయం సాధించాయి.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ(కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..