IPL 2023: మ్యాచ్ మధ్యలో అంపైర్ ఘోర తప్పిదం.. గుర్తించని ఇరుజట్ల ఆటగాళ్లు.. సీన్ కట్‌చేస్తే..

|

Apr 01, 2023 | 6:27 PM

PBKS vs KKR: క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ పాత్ర చాలా ముఖ్యమైనది. ఒక్క తప్పుడు నిర్ణయం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మ్యాచ్ ఫలితాన్నే మార్చగలదు. ఐపీఎల్-2023లోనూ ఇలాంటి తప్పే కనిపించింది. కానీ, సకాలంలోనే ఆ తప్పును..

IPL 2023: మ్యాచ్ మధ్యలో అంపైర్ ఘోర తప్పిదం.. గుర్తించని ఇరుజట్ల ఆటగాళ్లు.. సీన్ కట్‌చేస్తే..
Pbks Vs Kkr
Follow us on

ఐపీఎల్-2023లో నేడు రెండో రోజు. తొలి డబుల్ హెడర్‌‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. రెండు జట్లూ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగాయి. పంజాబ్‌కు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తుండగా, కోల్‌కతాకు నితీష్ రాణా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ తొలిసారిగా ఈ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. విజయంతో తమ ప్రచారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. అంపైర్ల నిర్ణయాలపై జట్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం చాలాసార్లు చూశాం. అయితే, పంజాబ్, కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ తప్పు చేసినా.. ఏ జట్టు కూడా గమనించలేకపోయింది. కానీ, థర్డ్ అంపైర్ మాత్రం ఓ కన్నేసి ఉంచడంతో అసలు తప్పు బయటపడింది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా కెప్టెన్ రాణా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్‌కు చెందిన ప్రభసిమ్రాన్ సింగ్, భానుక రాజపక్సేలు జట్టుకు తుఫాను ఆరంభాన్ని అందించి కోల్‌కతా బౌలర్లను చిత్తు చేశారు. అయితే, ఈ సమయంలో అంపైర్ పొరపాటు చేశాడు.

ఐదు బంతుల్లోనే ఓవర్..

పంజాబ్‌ ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్‌ కొనసాగుతోంది. కోల్‌కతాకు చెందిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఠాకూర్ ఐదు బంతులు వేయగానే, అంపైర్ ఓవర్ ముగిసినట్లు ప్రకటించాడు. కోల్‌కతా ఆటగాళ్లు స్థలాలను మార్చడం కూడా ప్రారంభించారు. తర్వాతి ఓవర్ కోసం ఫీల్డింగ్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఈ సమయంలో థర్డ్ అంపైర్ ఇంకా ఒక బంతి మిగిలి ఉందంటూ ప్రకటించాడు. దీంతో ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ ఠాకూర్‌ను వెనక్కి పిలిచి ఇంకా ఒక బంతి మిగిలి ఉందంటూ థర్డ్ అంపైర్ చెప్పాడు. అయితే, ఆ బంతికి పరుగులేమీ రాలేదు. కాగా, ఈ ఓవర్ కోల్‌కతాకు ఖరీదైనదిగా మారింది. ఈ ఓవర్‌లో అతను 12 పరుగులు చేశాడు. రెండో బంతికి ఫోర్ కొట్టిన రాజపక్సే, నాలుగో బంతికి కూడా ఫోర్ బాదాడు. ఈ బాల్ నో బాల్, ఆ తర్వాత ఫ్రీ హిట్ ఇచ్చారు. బహుశా ఈ కారణంగానే బాల్స్‌ను లెక్కించడంలో అంపైర్ గందరగోళానికి గురయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..