PBKS IPL 2023 Auction: సామ్ కరాన్‌ రాకతో తలరాతలు మారేనా.. మినీ వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే..

Punjab Kings Auction Players List: వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరాన్ నిలిచాడు. రూ.18.50 కోట్లతో సామ్ కరాన్‌ పంజాబ్ కింగ్స్ జట్టులో చేరాడు.

PBKS IPL 2023 Auction: సామ్ కరాన్‌ రాకతో తలరాతలు మారేనా.. మినీ వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు ఇదే..

Updated on: Dec 24, 2022 | 12:05 PM

Punjab Kings Auction Players List : ఐపీఎల్ మినీ వేలం 2023 ముగిసింది. ఈ వేలం కొచ్చిలో నిర్వహించారు. వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ నిలిచాడు. సామ్ కరాన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్ వేలంలో మొత్తం 6గురు ఆటగాళ్లను చేర్చుకుంది. సామ్ కరాన్‌తో పాటు, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వాత్ కెవెరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్‌లను పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.

మినీ వేలంలో పంజాబ్ కింగ్స్..

వేలంలో పంజాబ్ కింగ్స్ దాదాపు రూ.20 కోట్లు వెచ్చించింది. వేలం తర్వాత పంజాబ్ కింగ్స్ వద్ద 12.2 కోట్ల పర్సు మిగిలి ఉంది. పంజాబ్ కింగ్స్‌లో 3 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 1 స్లాట్ విదేశీ ఆటగాడిది. పంజాబ్ జట్టు సారథిగా శిఖర్ ధావన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు వేలం తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ జట్టు..

శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కుర్రాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, హర్‌ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us