గుడి బయట పూలమ్మే తల్లి.. క్రికెటే ప్రాణంగా పెరిగిన కొడుకు.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో లెక్కలు మార్చేశాడుగా

|

Jul 09, 2024 | 9:15 PM

Pathum Nissanka: నిస్సాంక సెంచరీ చేయడం కూడా ప్రత్యేకం. ఎందుకంటే క్యాండీ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. ఈ జట్టులో షనక, షోరిఫుల్ ఇస్లాం, చమీర, వనెందు హసరంగా, కమిందు మెండిస్, రమేష్ మెండిస్ వంటి బౌలర్లు ఉన్నారు. అయితే నిస్సాంక అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిస్సాంక గత 2 సంవత్సరాలలో తన ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడు. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఒకప్పుడు ఈ ఆటగాడి తల్లి గుడి బయట పూలు అమ్మేది. ఈరోజు తన బ్యాటింగ్‌తో కోట్లాది మంది హృదయాలను కొల్లగొడుతున్న ఈ ఆటగాడి తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

గుడి బయట పూలమ్మే తల్లి.. క్రికెటే ప్రాణంగా పెరిగిన కొడుకు.. కట్‌చేస్తే.. తుఫాన్ సెంచరీతో లెక్కలు మార్చేశాడుగా
Pathum Nissanka
Follow us on

Pathum Nissanka: శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ మంగళవారం లంక ప్రీమియర్ లీగ్‌లో అద్భుతాలు చేశాడు. జాఫ్నా కింగ్స్ తరపున ఆడుతున్న నిస్సాంక 59 బంతుల్లో 119 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. క్యాండీ ఫాల్కన్స్‌పై, నిస్సాంక 201 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి 16 ఫోర్లు, 4 సిక్సర్లు వచ్చాయి.

పాతుమ్ నిస్సాంక అత్యుత్తమ స్కోరు..

పాతుమ్ నిస్సాంక టీ20 క్రికెట్‌లో తొలిసారి సెంచరీ సాధించి, లంక ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిగా కూడా నిలిచాడు. సెంచరీ చేయడానికి వచ్చిన వెంటనే నిస్సాంక అద్భుతమైన ఆటిట్యూడ్‌తో బ్యాటింగ్ చేశాడు. నిస్సాంక కేవలం 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి పవర్‌ప్లేలో జట్టు స్కోరును 69 పరుగులకు చేర్చాడు. నిస్సాంక, మెండిస్ 59 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అందులో ఈ బ్యాట్స్‌మెన్ 78 పరుగులు అందించాడు.

నిస్సాంక కేవలం 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి కేవలం 17.1 ఓవర్లలో జాఫ్నా స్కోరును 200 దాటించాడు. అయితే, నిస్సాంక ఔట్ కావడంతో జాఫ్నా జట్టు కేవలం 224 పరుగులకే చేరుకోగలిగింది. నిస్సాంక మరికొంతసేపు క్రీజులో ఉండి ఉంటే ఈ స్కోరు 240కి దాటి ఉండేది.

బౌలర్లపై దండయాత్ర..

నిస్సాంక సెంచరీ చేయడం కూడా ప్రత్యేకం. ఎందుకంటే క్యాండీ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. ఈ జట్టులో షనక, షోరిఫుల్ ఇస్లాం, చమీర, వనెందు హసరంగా, కమిందు మెండిస్, రమేష్ మెండిస్ వంటి బౌలర్లు ఉన్నారు. అయితే నిస్సాంక అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిస్సాంక గత 2 సంవత్సరాలలో తన ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడు. వన్డేల్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఒకప్పుడు ఈ ఆటగాడి తల్లి గుడి బయట పూలు అమ్మేది. ఈరోజు తన బ్యాటింగ్‌తో కోట్లాది మంది హృదయాలను కొల్లగొడుతున్న ఈ ఆటగాడి తీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..