Pat Cummins IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన పాట్ కమ్మిన్స్.. దెబ్బకు కావ్యాపాప పర్స్ అంతా ఖాళీ..

|

Dec 19, 2023 | 2:56 PM

Pat Cummins Auction Price: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో దిగాడు. మొదట చెన్నై, ముంబయి వారి పోటీపడ్డాయి. ముంబై రంగంలోకి దిగింది. ముంబైతోపాటు RCB పోరాడింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు పాట్ కమ్మిన్స్ ధర రూ. 20 కోట్లకు పెరిగింది. అంటే అతడిని ఏ జట్టు కొనుగోలు చేసినా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ నిలవడం ఖాయంగా మారింది. చివరకు హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది.

Pat Cummins IPL Auction 2024: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన పాట్ కమ్మిన్స్.. దెబ్బకు కావ్యాపాప పర్స్ అంతా ఖాళీ..
Follow us on

Pat Cummins IPL 2024 Auction Price: కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తన నాయకత్వంలో ఆస్ట్రేలియాకు ఆరో ప్రపంచకప్‌ను అందించాడు. ఫైనల్‌ లో వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన టీమిండియాను ఓడించి మరీ తన జట్టును విశ్వ విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఫ్రాంచైజీల దృష్టి కూడా కమిన్స్‌పై పడింది.

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో దిగాడు. మొదట చెన్నై, ముంబయి వారి పోటీపడ్డాయి. ముంబై రంగంలోకి దిగింది. ముంబైతోపాటు RCB పోరాడింది. రూ.6 కోట్లు దాటింది. చివరకు పాట్ కమ్మిన్స్ ధర 20 కోట్లకు పెరిగింది. అంటే అతడిని ఏ జట్టు కొనుగోలు చేసినా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా కమిన్స్ నిలవడం ఖాయంగా మారింది. చివరకు హైదరాబాద్ కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌లో పాట్ కమిన్స్ 42 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను తన పేరు మీద 379 పరుగులు చేశాడు. 45 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అంటే, రికార్డు యావరేజ్ ఉన్నప్పటికీ ప్యాట్ కమిన్స్ పై ఇంత మొత్తంలో కాసుల వర్షం కురిపించిందంటే.. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పెద్ద జూదం ఆడిందనే చెప్పాలి.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు..

  • 20.50cr – పాట్ కమ్మిన్స్ (SRH, 2024)*
  • 18.50cr – సామ్ కర్రాన్ (PBKS, 2023)
  • 17.50cr – కామెరాన్ గ్రీన్ (MI, 2023)
  • 16.25cr – బెన్ స్టోక్స్ (CSK, 2023)
  • 16.25cr – క్రిస్ మోరిస్ (RR, 2021)
  • 16.00cr – యువరాజ్ సింగ్ (DC, 2015)
  • 16.00 కోట్లు – నికోలస్ పూరన్ (LSG, 2023)
  • 15.50cr – పాట్ కమ్మిన్స్ (KKR, 2020)

సన్‌రైజర్స్ హైదరాబాద్:ఐడెన్ మార్క్‌రామ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్ , వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్హాక్ ఫరూకీ, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, షాబాజ్ అహ్మద్.

  • ట్రావిస్ హెడ్ – 6.80 కోట్లు (ప్రాథమిక ధర 2 కోట్లు)
  • వానిందు హసరంగా – 1.50 కోట్లు (బేస్ ప్రైస్ 1.5 కోట్లు)
  • పాట్ కమిన్స్- 20.50 కోట్లు (బేస్ ప్రైస్ 2 కోట్లు)