IND vs PAK Match: దుబాయ్‌లో అద్భుతం జరిగింది. టీ20 వరల్డ్ కప్ 2021 భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. పాకిస్థాన్ ఓపెనర్ల దూకుడుకు టీమిండియా చేతులెత్తేసింది. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టించారు. అసలు ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. భారత్ ఇచ్చిన 152 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ సునాయాసంగా చేధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు.
సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే పాకిస్థాన్ ఓపెనర్ల వేగాన్ని మాత్రం భారత బౌలర్లు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా పాక్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Also Read: Samantha: సమంతకు అమ్మ చెప్పిన మాట ఇదే.. అందుకే అంత ధైర్యం ఆమెకు!.. వైరల్ అవుతున్న పోస్ట్..