క్రికెట్‌ను నాశనం చేయాలని పాక్ ప్లాన్ చేస్తోంది: మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

ఈ దాడికి నిరసనగా, నవంబర్‌లో లాహోర్, రావల్పిండిలలో జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ త్రి-సిరీస్ (Tri-Series) నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వైదొలిగింది. కరీం సాదిక్‌తో పాటు రషీద్ ఖాన్, ఫజల్‌హక్ ఫారూఖీ, గుల్బదిన్ నైబ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం పౌరుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

క్రికెట్‌ను నాశనం చేయాలని పాక్ ప్లాన్ చేస్తోంది: మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
Pakistan

Updated on: Oct 18, 2025 | 5:51 PM

అంతర్జాతీయ క్రికెట్‌లో రాజకీయాలు, సరిహద్దు వివాదాలు తరచుగా క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. తాజాగా, ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ కరీం సాదిక్ (Karim Sadiq) పాకిస్తాన్‌పై చేసిన సంచలన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించాయి. తమ దేశంలోని పౌరులు, ముఖ్యంగా స్థానిక క్రికెటర్లపై జరిగిన దాడిని ఖండిస్తూ, “పాకిస్తాన్ క్రికెట్‌నే నాశనం చేయాలనుకుంటోంది” అని ఆయన ఆరోపించారు.

క్రికెటర్ల మృతిపై ఆగ్రహం..

పాకిస్తాన్ జరిపిన “పిరికిపంద దాడి” (cowardly attack) లో ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉర్గున్ జిల్లాలో అమాయక పౌరులతో పాటు ముగ్గురు స్థానిక క్రికెటర్లు కబీర్ (Kabeer), సిబ్ఘతుల్లా (Sibghatullah), హరూన్ (Haroon) మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ధృవీకరించింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కరీం సాదిక్, మృతి చెందిన యువ క్రికెటర్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు భవిష్యత్తు అని పేర్కొన్నారు.

సాదిక్ మాట్లాడుతూ, “మాకు దాడులంటే భయం లేదు. మా ప్రధాన క్రికెటర్లు ముగ్గురు, మైనర్ క్రికెటర్లు ఐదుగురు చనిపోయారు. మా పిల్లలు పేద కుటుంబాల నుంచి వచ్చారు. వారిని చంపడం ద్వారా పాకిస్తాన్ పిరికిపంద చర్యకు పాల్పడింది. కానీ ఇవేవీ క్రికెట్‌ను ఆపలేవు, మేం ఆడటం కొనసాగిస్తాం” అని దృఢంగా చెప్పారు.

పాకిస్తాన్‌తో ఇక షేక్ హ్యాండ్‌లు లేవు..

ఈ ఘోరం నేపథ్యంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో ఇకపై షేక్ హ్యాండ్స్ (Shake hands) కూడా ఇవ్వదని సాదిక్ స్పష్టం చేశారు. ఇటీవల ఆసియా కప్‌లో భారతదేశం తీసుకున్న వైఖరిని ఆదర్శంగా తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

“భారత్ లాగే, మేమూ ఇకపై పాకిస్తాన్‌తో షేక్ హ్యాండ్స్ ఇవ్వం” అని ఆయన తెలిపారు.

‘పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేయాలనుకుంటోంది’

ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 2,000 చిన్న, పెద్ద క్లబ్‌లు ఉన్నాయని, మరణించిన ఈ యువ క్రికెటర్లు తమ ప్రాంతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకునే అవకాశం ఉందని కరీం సాదిక్ వివరించారు.

“క్రికెటర్లు ప్రపంచాన్ని ఏకం చేయడానికి కృషి చేస్తారు. కానీ పాకిస్తాన్ క్రికెట్‌నే నాశనం చేయాలనుకుంటోంది. ఎంతో మంది అమాయక జీవితాలు కోల్పోయారు” అని సాదిక్ తీవ్రంగా విమర్శించారు.

“నేను ఉగ్రవాదిని అవుతానా? రషీద్ ఖాన్ ఉగ్రవాది అవుతాడా? మేం పఠాన్‌లం. మా మతమే ప్రేమ. మేం క్రికెట్ ద్వారా ప్రపంచానికి ప్రేమ, స్నేహ సందేశాన్ని పంపుతాం. రాత్రిపూట గెస్ట్‌హౌస్‌లో భోజనం చేస్తున్న క్రికెటర్లపై పిరికిపంద దాడి జరగడం చాలా బాధాకరం,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

త్రి-సిరీస్ నుంచి వైదొలగిన ఆఫ్ఘాన్..

ఈ దాడికి నిరసనగా, నవంబర్‌లో లాహోర్, రావల్పిండిలలో జరగాల్సిన పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ త్రి-సిరీస్ (Tri-Series) నుంచి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వైదొలిగింది. కరీం సాదిక్‌తో పాటు రషీద్ ఖాన్, ఫజల్‌హక్ ఫారూఖీ, గుల్బదిన్ నైబ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం పౌరుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..