Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనలో టెస్టు సిరీస్ ఆడుతున్న పాక్ జట్టులోని ఇద్దరు స్టార్ ప్లేయర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరెవరో కాదు కెప్టెన్ బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్. డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరూ గొడవకు దిగారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గేమ్-ప్లే చర్చ ప్రారంభమైంది. దాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇది నిజమైన వాగ్వాదం కాదు. ఆటలో సరదాగా గొడవపడుతూ ఓ వీడియోను పంచుకున్నారు. నిజానికి రెండో టెస్టు రెండో, మూడో రోజు వర్షం కారణంగా రద్దయింది.
మైదానంలో క్రికెట్ ఆడడం కుదరకపోవడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెట్ ఆట ప్రారంభించారు. ఈ సమయంలో, బాబర్ ఆజం ఒక బంతిని ఇమామ్-ఉల్-హక్‌కి వేశాడు. దాని తర్వాత అసలు రచ్చ మొదలైంది. బాబర్ ఆజం తన బంతికి ఇమామ్ ఔట్ అయ్యాడని అనుకున్నాడు. అయితే ఈ బ్యాట్స్‌మెన్ దానిని తిరస్కరించాడు. వీధి క్రికెట్‌లో లాగా రచ్చ మొదలైంది. ఈ వీడియోను పీసీబీ ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేసింది.
బాబర్‌ని తోసిపుచ్చిన ఇమామ్..
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే పాక్ కెప్టెన్ త్వరగా ప్రతీకారం తీర్చుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ క్రికెట్‌లో బాబర్ ఆజం ఇమామ్ స్టంప్‌లను పడగొట్టాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ ఆజం 10 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్ జట్టు సరదాగా ఆడుతూ గొడవ పడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరలవుతోంది.
నాలుగో రోజు మొలైన ఆట..
వర్షంతో రెండు, మూడు రోజుల ఆట రద్దైంది. అయితే నేడు మాత్రం వరణుడు కాస్త గ్యాప్ ఇవ్వడంతో ఆట మొదలైంది. కడపడి వార్తలు అందేసరికి పాకిస్తాన్ టీం 4 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. అబిద్ అలీ 39, అబ్దుల్లా షఫీక్ 25, అజహర్ అలీ 56, బాబర్ అజం 76 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఫవాద్ ఆలం 48, మహ్మద్ రిజ్వాన్ 53 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లాం 2, ఖలీద్ అహ్మద్ 1, ఎబాడోత్ హుస్సేన్ 1 వికెట్ పడగొట్టారు. అయితే మరో రోజు మాత్రమే ఆట మిగిలి ఉండడంతో రెండో టెస్ట్ డ్రా దిశగా సాగుతోంది.
When Imam returned, DRS had to be brought into play pic.twitter.com/wUpq5pnD93
— Pakistan Cricket (@TheRealPCB) December 5, 2021