
ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు ముందు పాకిస్థాన్ జట్టు మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్, శ్రీలంకలలో జరగనుండగా, తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. అలాగే, భారత జట్టు తమ ఆసియా కప్ పోరాటాన్ని సెప్టెంబర్ 2న పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా ప్రారంభించనుంది. అయితే ఈ మ్యాచ్ శ్రీలంకలో జరగడం విశేషం. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కంటే ముందే శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడనుంది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్థాన్‌తో పాకిస్థాన్ 3 వన్డేల సిరీస్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పచ్చజెండా ఊపింది. ఆగస్టు 22 నుంచి ఆగస్టు 26 వరకు సిరీస్ జరగనుంది. అంటే భారత్‌తో మ్యాచ్‌కు వారం రోజుల ముందు శ్రీలంకలో పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనుంది. దీని ద్వారా పాక్ జట్టు ఆసియాకప్‌కు సన్నద్ధం కావడానికి పక్కా ప్రణాళిక రచించింది.
ఈసారి ఆసియా కప్ హైబ్రిడ్ విధానంలో జరగనుంది. అంటే ఒకే టోర్నీని రెండు దేశాల్లో నిర్వహిస్తున్నారు. ఆసియా కప్ 2023కి ఆతిథ్యం ఇచ్చే హక్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఉంది. అయితే పాకిస్థాన్‌లో టోర్నీ నిర్వహిస్తే భారత జట్టు పాల్గొనబోదని బీసీసీఐ స్పష్టం చేసింది. అందుకే టోర్నీలో 4 మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో, మిగిలిన మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించారు. భారత్ ఆడే అన్ని మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ 2023 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు ఈ మేజర్ టోర్నీలో తలపడనున్నాయి. ఆసియా కప్‌లో మొత్తం13 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఒక్కో జట్టు తమ గ్రూపుల్లోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత ఒక్కో గ్రూప్ నుంచి మొదటి 4 స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్ దశకు చేరుకుంటాయి. చివరగా, సూపర్ ఫోర్ దశ నుండి మొదటి రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..