Telugu News Sports News Cricket news Pakistan star bowler shaheen shah afridi out of asia cup 2022 with injured pakistan cricket team india vs pakistan
IND vs PAK: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు భారీదెబ్బ.. ఆసియా కప్‌కు నుంచి దూరమైన స్టార్ బౌలర్..
ASIA CUP 2022: ఆసియా కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ASIA CUP 2022: ఆసియా కప్ 2022 ప్రారంభానికి వారం రోజుల ముందు, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఈమేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆగస్ట్ 20 శనివారం సోషల్ మీడియాలో సమాచారం అందించింది. షాహీన్ గాయంపై వివరణ ఇస్తూ, ఓ ట్వీట్ చేసింది. మోకాలి గాయం కారణంగా అఫ్రిదీకి నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు పాక్ బోర్డు తెలిపింది. ఆసియా కప్‌లో పాకిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో ఆగస్టు 28న భారత్‌తో తలపడనుంది.