నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు(Viral) సందడి చేస్తుంటాయి. వీటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక క్రికెట్(Cricket) విషయానకి వస్తే, ఈ వీడియోలు కూడా నెట్టింట్లో తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య జరుగుతోన్న వన్డే మ్యాచ్‌లోనే ఓ అద్భుతమైన క్యాచ్ నెటిజన్లుకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడంతో, ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్, వెస్టిండీస్(PAK vs WI) మధ్య బుధవారం ముల్తాన్ వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ముల్తాన్‌లో 14 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్‌లో కైల్ మేయర్స్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను షాహీన్ అఫ్రిది అద్భుతంగా పట్టి వెస్టిండీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత షాయ్ హోప్, షమ్రా బ్రూక్స్ రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్స్‌ను మహ్మద్ నవాజ్ విడగొట్టాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా వచ్చిన ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుని షాదాబ్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుం నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.
నవాజ్ వేసిన బంతిని బ్రూక్స్ స్వీప్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బ్యాట్స్‌మన్ టైమింగ్ సరిగా లేకపోవడంతో బంతి అతని బ్యాట్ బయటి అంచుకు తగిలి షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు వెళ్లింది. పాయింట్‌లో ఉన్న షాదాబ్ ఖాన్ క్యాచ్ పట్టేందుకు బంతి వైపు పరుగులు తీశాడు. బంతి కిందకు పడిపోతుందేమో అనిపించినా.. షాదాబ్ ఎడమవైపు గాలిలో దూకి ఒంటి చేత్తో అపురూపమైన క్యాచ్ పట్టాడు. షాదాబ్ ఖాన్ క్యాచ్ వీడియోను పీసీబీ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టీం 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు సాధిచింది. అనంతరం పాకిస్తాన్ టీం 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.