IND vs PAK LIVE Score: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్ బౌలర్ల దాటికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్‌లలో కేవలం 151 పరుగులు మాత్రమే సాధించింది. ఇక భారత్ ఇచ్చిన లక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగి పాకిస్థాన్ మొదటి నుంచి ధీటుగా ఆడుతోంది. ఈ క్రమంలోనే పాక్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి ఆడుతున్నారు.
లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న పాకిస్థాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 100 పరుగులు మార్కును దాటేసింది. పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు ఆచితూచి ఆడుతూ పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఓపెనర్లు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం అందిన స్కోరు వివరాల ప్రకారం పాకిస్థాన్ 15 ఓవర్‌లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 151 పరుగుల వద్ద కొనసాగుతోంది.
ఇక క్రీజులో అజమ్ (62 ), రిజ్వాన్ ( 56 ) పరుగులతో కొనసాగుతున్నారు. పాకిస్థాన్ విజయం సాధించడానికి 30 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఏమైనా అద్భుతం జరిగి మ్యాచ్ ఇండియావైపు అనుకూలంగా మారుతుందో చూడాలి.