
Imad Wasim’s Alleged Affair, Wife Shares Cryptic Post: పాకిస్తాన్ క్రికెట్ ఆల్-రౌండర్ ఇమాద్ వసీం వ్యక్తిగత జీవితం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతడిపై ‘అఫైర్’ ఆరోపణలు వెల్లువెత్తగా, ఈ వ్యవహారానికి ఆయన భార్య సానియా అష్ఫాక్ చేసిన ఒక ‘క్రిప్టిక్ పోస్ట్’ మరింత ఆజ్యం పోసింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఈ విషయంపై ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు.
తాజాగా సానియా అష్ఫాక్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. “నేను నిన్ను 9 నెలల పాటు ఒంటరిగానే నా కడుపులో మోశాను. ముందున్న ప్రయాణానికి అల్లా నాకు మరింత శక్తిని ప్రసాదించుగాక, జైన్” అని ఆమె రాశారు. ఈ పోస్ట్ ఇమాద్ వసీం వ్యవహారానికి సంబంధించిందని, ఆయనపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. అంతేకాకుండా, సానియా తన ఇన్‌స్టాగ్రామ్ బయోను “వైఫ్ టు ఇమాద్ వసీం” నుంచి “మామ్ టు ఇనాయా ఇమాద్, ర్యాన్ ఇమాద్”గా మార్చినట్లు సమాచారం. ఇది కూడా ఈ పుకార్లకు బలం చేకూర్చుతోంది.
ఇమాద్ వసీంపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, 2017లో ఒక డచ్ యువతి ఇమాద్ వసీంకు అనేకమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. అప్పట్లో వారిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీకయ్యాయి. ఈ సంఘటన పాకిస్తాన్ క్రికెట్‌లో పెద్ద దుమారాన్నే రేపింది.
ప్రస్తుతానికి, ఇమాద్ వసీం ఈ ఆరోపణలను ధ్రువీకరించలేదు లేదా ఖండించలేదు. దీంతో అభిమానులు ఒక అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మీడియా దృష్టి నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, ఇమాద్ వసీం ఈ విషయంపై ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.
పాకిస్తాన్ క్రికెటర్లు తరచుగా వ్యక్తిగత వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. బాబర్ ఆజం, షోయబ్ మాలిక్ వంటి అనేకమంది స్టార్ ప్లేయర్‌ల వ్యక్తిగత జీవితాలు గతంలో పబ్లిక్‌గా చర్చకు వచ్చాయి. ఇది ఆటగాళ్ల ప్రదర్శనపై, జట్టు వాతావరణంపై కూడా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇమాద్ వసీం వ్యవహారం కూడా పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో కొంత ఆందోళనను రేకెత్తిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..