India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!

|

Nov 18, 2021 | 9:11 PM

2012-13 నుంచి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. రెండు జట్లు కేవలం ఆసియా కప్, వన్డే టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే తలపడ్డాయి.

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్‌పై పీసీబీ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు.. ట్రై సిరీస్‌లు ఆడదామంటూ బీసీసీఐకి ఆఫర్..!
India Vs Pakistan
Follow us on

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఐసీసీ టోర్నీ, ఆసియా కప్ కోసం వేచి చూడాల్సిందే. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడగా వచ్చే ఏడాది జరిగే ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లో ఆడాలని భావిస్తున్నారు. అలాగే రానున్న సంవత్సరాల్లో జరిగే ఇలాంటి టోర్నీల్లో ఇరు జట్లు తలపడవచ్చు. దాదాపు 8-9 ఏళ్లుగా భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్‌ జరగలేదు. అది ముందుకు సాగే అవకాశం లేదు. అయితే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ వంటి టోర్నీల్లో ఇరు జట్లను వీక్షించడంపై ఆధారపడకుండా అభిమానులను మెప్పించేలా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడు రమీజ్ రాజా ఒక సూచన చేశారు.

ఇటీవలే పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రమీజ్ రాజా కూడా ప్రస్తుతానికి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌కు అవకాశం లేదని, అయితే రాబోయే ముక్కోణపు సిరీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఆడగలవని అభిప్రాయపడ్డాడు. గురువారం పాక్ మీడియాతో మాట్లాడిన రమీజ్ రాజా, “ఈ సమయంలో, భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేదు, అయితే ముక్కోణపు టోర్నమెంట్‌లో ఇరు జట్లను ప్రజలు చూడగలరని మేం ఆశిస్తున్నాం” అని ఆయన అన్నారు.

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2012-13లో జరిగింది. పాకిస్తాన్ జట్టు వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారతదేశంలో పర్యటించింది. అప్పటి నుంచి ఆసియా కప్, వన్డే, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రమే ఇరు జట్లు ఒకరితో ఒకరు ఆడటం కనిపించింది.

బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలగుతుందా?
రానున్న కాలంలో ఇరు జట్లు మరోసారి తలపడే అవకాశం ఉంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాబోయే కాలంలో ఆసియా కప్ 2023, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయంలో భారత ప్రభుత్వ క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ రాబోయే కాలంలో శాంతిభద్రతల పరిస్థితిని చూసిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

అదే సమయంలో, ఈ టోర్నమెంట్ల నుంచి టీమ్ ఇండియా వైదొలిగే విషయంపై, రమీజ్ రాజా మాట్లాడుతూ, అంతర్జాతీయ టోర్నీ నుంచి వైదొలగడం అంత సులువైన విషయం కాదని పీసీబీ ఛైర్మన్‌ అన్నారు. హోస్టింగ్ హక్కులు మంజూరు చేసే సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు వివిధ క్రికెట్ బోర్డుల మధ్య వివాదాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నా అభిప్రాయం ప్రకారం, భారతదేశం తన పేరును ఉపసంహరించుకోదు అని ఆయన అన్నారు.

Also Read: India Vs New Zealand: రాంచీ స్టేడియానికి చేరుకున్న మహేంద్ర సింగ్ ధోనీ.. కారణం ఏంటంటే?

IND vs NZ: రాంచీలో రెండో టీ20పై నీలిమేఘాలు.. హైకోర్టులో పిల్.. ఎందుకో తెలుసా?