‘ఆహా.. ఏమి రుచి.!’ హైదరాబాద్ ‘బిర్యానీ’ను లాగిస్తున్న పాక్ క్రికెటర్లు.. నగరమంతటా షికారు..

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ 'పెషావర్ రెస్టారెంట్'‌లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు.

ఆహా.. ఏమి రుచి.! హైదరాబాద్ బిర్యానీను లాగిస్తున్న పాక్ క్రికెటర్లు.. నగరమంతటా షికారు..
Pakistan Cricket Team

Updated on: Oct 09, 2023 | 1:38 PM

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ 2023లో హైదరాబాద్‌కు విచ్చేసిన పాకిస్తాన్ క్రికెట్ టీం.. మ్యాచ్‌ల విరామంలో.. వీలు దొరికినప్పుడల్లా భాగ్యనగర రుచులను ఎంజాయ్ చేస్తోంది. నగరంలోని టాప్ హోటల్స్‌లో పాక్ ఆటగాళ్లు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం నగరంలో ప్రముఖ హోటల్ ‘పెషావర్ రెస్టారెంట్’‌లో హైదరాబాదీ వంటకాలను ఎంజాయ్ చేస్తూ కనిపించారు పాక్ క్రికెటర్లు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ‘పెషావర్ హోటల్’ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో షేర్ చేశారు ఆ రెస్టారెంట్ సిబ్బంది.

నగరంలో గట్టి పోలీస్ భద్రత మధ్య పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్.. హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాల్లో బిర్యానీతో పలు దేశీయ రుచులను ఆస్వాదిస్తూ.. కెమెరాకు చిక్కారు. భాగ్యనగరంలోని ప్రముఖ రెస్టారెంట్లతో పాటు ‘పెషావర్ హైదరాబాద్’లోనూ పాక్ క్రికెటర్లు కనిపించారు.

బాబర్ అజామ్, ఇమామ్-ఉల్-హక్ మినహా.. మిగిలిన పాక్ క్రికెట్ ప్లేయర్స్.. మన హైదరాబాద్ బిర్యానీ రుచిని.. వారి స్వస్థలమైన ‘కరాచీ బిర్యానీ’తో పోల్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల ‘జువెల్ ఆఫ్ నిజాం’లో పాక్‌ క్రికెట్ టీమ్‌.. హైదరాబాద్‌కు చెందిన VIIవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. పెయింటింగ్‌ను మెచ్చుకోవడం.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం మీరు చూసే ఉంటారు.

హైదరాబాద్‌లో పాకిస్థాన్ మ్యాచ్‌లు..

పాకిస్తాన్ తన ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. పసికూన నెదర్లాండ్స్‌ను 81 పరుగుల తేడాతో గెలిచింది. హారిస్ రూఫ్, రిజ్వాన్, షకీల్ పాక్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక హైదరాబాద్‌లో పాకిస్తాన్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడగా.. అక్టోబర్‌ 6న నెదర్లాండ్స్‌తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్, అలాగే అక్టోబర్ 10న శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..