PAK vs NED: ఇదే అంపైరింగ్ భయ్యా.. ఐదు బంతులకే ఓవర్ ముగించేశారుగా.. తిట్టిపోస్తోన్న పాక్ ఫ్యాన్స్..

PAK vs NED, ODI World Cup 2023: ఫఖర్ జమాన్, కెప్టెన్ బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ మొదటి పవర్‌ప్లేలో పెవిలియన్ చేరడంతో పాకిస్తాన్ టాప్-ఆర్డర్‌ను నెదర్లాండ్ బౌలర్లు కుప్పకూల్చడంలో సఫలమయ్యారు. గత ఏడాది T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు బంతుల ఓవర్‌ను ఎదుర్కొంది. ఇదే విధమైన అంపైరింగ్ జరిగింది. పాకిస్తాన్ జట్టు పవర్ ప్లేలోపే పూర్తయ్యే లోపే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అంపైరింగ్ తప్పిదంతో ఓ పొరపాటు జరిగింది.

PAK vs NED: ఇదే అంపైరింగ్ భయ్యా.. ఐదు బంతులకే ఓవర్ ముగించేశారుగా.. తిట్టిపోస్తోన్న పాక్ ఫ్యాన్స్..
Pak Vs Ned

Updated on: Oct 06, 2023 | 4:37 PM

PAK vs NED, ODI World Cup 2023: శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్ టీం తలపడుతోంది. వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా ఇది రెండో మ్యాచ్. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం పాకిస్తాన్ పాలిట శాంపలా మారింది. ఎందుకంటే ఆ జట్టు పవర్ ప్లేలోపే పూర్తయ్యే లోపే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అంపైరింగ్ తప్పిదంతో ఓ పొరపాటు జరిగింది. దీంతో పాకిస్తాన్ ఒక బంతిని కోల్పోయింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే పడ్డాయి. ఓవర్‌కు ఆరు బంతులు పడాల్సిన చోట కేవలం 5 బంతులు మాత్రమే పడ్డాయి. నెదర్లాండ్స్ సీమర్ పాల్ వాన్ మీకెరెన్ అద్భుతంగా ఓవర్‌ను ప్రారంభించాడు. ఈ ఓవర్‌లో మహ్మద్ రిజ్వాన్‌కు మూడు బంతుల్లో పరుగులు చేయలేదు. అయితే , నాలుగో బంతికి సింగిల్ తీసి షౌద్ షకీల్‌కి బ్యాటింగ్ అందించాడు. ఐదో బంతిని ఫోర్‌కు తరలించిన షకీల్.. మాంచి ఊపులో కనిపించాడు. అయితే, అంపైర్ పొరపాటుతో ఓవర్ పూర్తయినట్లు ప్రకటించారు. ఇరువైపులా అంపైరింగ్ తప్పిదాన్ని గుర్తించలేదు. అంపైర్లు వెంటనే తదుపరి ఓవర్‌కు వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఫఖర్ జమాన్, కెప్టెన్ బాబర్ ఆజం, ఇమామ్-ఉల్-హక్ మొదటి పవర్‌ప్లేలో పెవిలియన్ చేరడంతో పాకిస్తాన్ టాప్-ఆర్డర్‌ను నెదర్లాండ్ బౌలర్లు కుప్పకూల్చడంలో సఫలమయ్యారు.

గత ఏడాది T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు బంతుల ఓవర్‌ను ఎదుర్కొంది. ఇదే విధమైన అంపైరింగ్ జరిగింది.

మ్యాచ్ పరిస్థితి:

టాస్ ఓడిన పాక్ జట్టు ఆది నుంచి కష్టాలు పడుతూనే ఉంది. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు 188 పరుగులు మాత్రమే చేసింది. 68 పరుగుల వద్ద మహ్మద్ రిజ్వాన్ ఔటయ్యాడు. బాస్ డి లీడే బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సౌద్ షకీల్ 68 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ఇమామ్ ఉల్ హక్ 15 పరుగులు, కెప్టెన్ బాబర్ అజామ్ 5 పరుగులు, ఫఖర్ జమాన్ 12 పరుగులకే పెవిలియన్ చేరారు.

రెండు జట్లలో ప్లేయింగ్-11

పాకిస్థాన్: బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, మహ్మద్ రిజ్వాన్, షౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.

నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్/వికె), విక్రమజీత్ సింగ్, మాక్స్ డౌట్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..