టీ20 వర్డల్ కప్‌లో భారత్ ఆదివారం పాకిస్తాన్‌తో తలపడి ఓడిపోయింది. ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కమార్, వివేక్ ఒబెరాయ్ మధ్యలోనే వెళ్లిపోయారని పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి అన్నాడు. మొదటగా భారత్ బ్యాటింగ్ సమయంలో మద్దతు తెలిపిన వీరిద్దరు మ్యాచ్ క్రమంగా పాక్ చేతిలోకి వెళ్లిపోవటంతో వారు వెళ్లిపోయినట్లు చెప్పాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గవర్నర్ సింధ్ ఇమ్రాన్ ఇస్మాయిల్‌తో కలిసి ఆయన ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇద్దరు బాలీవుడ్ నటులు పెద్ద వాదనలు చేశారని అయితే భారత్‌పై పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించడంతో ఇద్దరూ మధ్యలోనే వెళ్లిపోయారని స్థానిక మీడియాకు తెలిపారు.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్‌ని అభినందించిన ఆలింగనం చేసుకున్నందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని సమాచార మంత్రి అభినందించారు. “ఇది క్రీడాకారుడి స్ఫూర్తి” అని ఆయన అన్నారు. క్రికెట్ భారతదేశం, పాకిస్తాన్ ప్రజలను ఏకం చేసిందని చెప్పారు. భారత్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు. ఈ మ్యాచ్‌లో152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు రిజ్వాన్, అజమ్‌లు భారత బౌలర్లకు చుక్కులు చూపించారు. ఎక్కడ తడబడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పాక్ జయ కేతనాన్ని ఎగరవేసింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి నుంచి తడబడింది. పాకిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో భారత ఆటగాళ్లు పెవిలియన్ బాట పట్టారు. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో కేవలం విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్‌ను విరాట్ ఆదుకున్నాడు. 48 బంతుల్లో 57(ఐదు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేశాడు. సహచరులు ఔటైనా కెప్టెన్ కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్, రవీంద్ర జాడేజాతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Read Also.. Ind Vs Pak: భారత జట్టుకు ఇది హెచ్చరిక.. అన్నీ మరిచిపోయి మిగతా మ్యాచ్‌లపై దృష్టి సారించండి..