145 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఒకేరోజు 4 సెంచరీలు, 506 పరుగులతో పాక్ బౌలర్లపై ఊచకోత.. బద్దలైన 7 రికార్డులు..

Pakistan vs England: 17 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్ జట్టు టెస్ట్ సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ చేరుకుంది. అయితే, ఎన్నో భయాందోళనల మధ్య ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎన్నో ఏళ్ల రికార్డులు బ్రేక్ చేశారు.

145 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. ఒకేరోజు 4 సెంచరీలు, 506 పరుగులతో పాక్ బౌలర్లపై ఊచకోత.. బద్దలైన 7 రికార్డులు..
Pakistan Vs England 1st Test
Follow us
Venkata Chari

|

Updated on: Dec 02, 2022 | 9:56 AM

ఇంగ్లండ్ టీం పాకిస్తాన్ ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎంతగానో సద్వినియోగం చేసుకుంది. చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌లో తుపాన్ బ్యాటింగ్‌తో రికార్డుల మోత మోగించింది. ఎనో భయాందోళనల మధ్య, రావల్పిండిలోని పిండి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభమైందనే సంతోషం పాకిస్తాన్‌కు కొద్దిసేపు కూడా మిగల్చలేదు ఇంగ్లండ్ ఆటగాళ్లు. మ్యాచ్‌కు ముందు, ఇంగ్లీష్ జట్టులోని 14 మంది ఆటగాళ్లకు అనారోగ్యం కారణంగా , మ్యాచ్‌ను సమయానికి ప్రారంభించడంపై భయాందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ, మ్యాచ్ ప్రారంభమైనప్పుడు, పిచ్ చూసి, ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ల మనసు ప్రశాంతంగా మారింది. దీంతో బ్యాటింగ్‌లో ఎన్నో ఎళ్ల నాటి రికార్డులను బద్దలు చేసి, పాకిస్తాన్‌ను బలి పశువులా మార్చేశారు.

గత 5 నెలలుగా ‘బాజ్‌బాల్’ ఫిలాసఫీతో టెస్ట్ క్రికెట్‌లో భయాందోళనలు సృష్టిస్తున్న ఇంగ్లిష్ టీమ్ పైనే అందరి చూపు పడింది. పాకిస్థాన్‌పై అలా చేయగలదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ, ఇంగ్లండ్ తమ అదే వైఖరిని కొనసాగించడమే కాకుండా, చాలా ఫ్లాట్ పిచ్‌ను సద్వినియోగం చేసుకుని, బౌలర్లను చిత్తు చేసింది. మొదటి రోజు కేవలం 75 ఓవర్లలో 506 పరుగులు చేసింది.

రావల్పిండిలో తొలిరోజు బద్దలైన రికార్డులు..

  1. తొలి రోజు ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. ఈ విధంగా ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు, ఒక జట్టు 500 ఫిగర్‌ను తాకి రికార్డు సృష్టించింది. సుమారు 145 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలా అద్భుతం జరగడం ఇదే తొలిసారి.
  2. ఇంగ్లండ్‌కు ముందు, ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు అత్యధిక పరుగులు చేసిన రికార్డు 494 గా నిలిచింది. ఇది 1910 సిడ్నీ టెస్ట్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా చేసింది. దానిని ఇంగ్లండ్ 75 ఓవర్లలోపే దాటేసింది.
  3. ఇవి కూడా చదవండి
  4. ఇది మాత్రమే కాదు, ఇంగ్లాండ్ నుంచి నలుగురు బ్యాట్స్‌మెన్; జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, హ్యారీ బ్రూక్.. మ్యాచ్‌లో తొలిరోజే సెంచరీ కొట్టారు. టెస్ట్ క్రికెట్‌లో మొదటి రోజు 4 సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.
  5. ఇంగ్లండ్‌ తరపున ఓపెనింగ్‌ చేసిన జాక్‌ క్రాలీ కేవలం 86 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్ చేసిన వేగవంతమైన టెస్టు సెంచరీగా కూడా రికార్డు సృష్టించింది.
  6. హ్యారీ బ్రూక్ తన రెండో టెస్టు ఆడుతున్నాడు. కేవలం 80 బంతుల్లోనే తన కెరీర్‌లో మొదటి సెంచరీని సాధించాడు. తద్వారా టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
  7. ఇది మాత్రమే కాదు ఓపెనింగ్ జోడీ క్రాలీ, బెన్ డకెట్ కేవలం 136 బంతుల్లో 150 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. టెస్టు క్రికెట్‌లో ఇది సరికొత్త రికార్డుగా కూడా మారింది.
  8. దీంతో పాటు క్రాలే, డకెట్ జోడీ తొలి సెషన్‌లో వికెట్ నష్టపోకుండా 174 పరుగులు చేసింది. టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే