PAK vs ENG: పాకిస్తాన్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. అంతుచిక్కని వైరస్ బారిన 14 మంది ఆటగాళ్లు..

|

Nov 30, 2022 | 2:38 PM

Pakistan vs England: పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ రేపటి నుంచి జరగనుంది. దీనికి ముందు, ఇంగ్లండ్ జట్టులోని 14 మంది సభ్యులు వైరస్ బారిన పడ్డారు.

PAK vs ENG: పాకిస్తాన్‌లో ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..  అంతుచిక్కని వైరస్ బారిన 14 మంది ఆటగాళ్లు..
Pakistan Vs England
Follow us on

Pakistan vs England Test Series: డిసెంబర్ 1 నుంచి పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరగనుంది. ఇందుకోసం ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ జట్టులో సంక్షోభం నెలకొంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో సహా జట్టులోని 14 మంది సభ్యులకు తెలియని వైరస్‌ సోకింది. మీడియా కథనాల ప్రకారం, రావల్పిండిలో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఈ వైరస్ సోకిందని, ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలని కోరారు.

ఆటగాళ్లు వ్యాధి బారిన పడడం ఇంగ్లండ్‌కు బ్యాడ్ న్యూస్‌లా మారింది. దీనికి సంబంధించి బీబీసీ ఓ నివేదికను ప్రచురించింది. బీబీసీ ప్రకారం, వైరస్ సోకిన 14 మందిలో సగం మంది సిబ్బంది కూడా ఉన్నారు. సగం మంది ఆటగాళ్లు ఉన్నారు. టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ చేరుకుంది. కానీ, ఇప్పుడు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కారణంగా సంక్షోభం వచ్చింది. ఈ ఆటగాళ్లు, సిబ్బంది అంతా హోటల్‌లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా వైరస్ బారిన పడ్డాడు.

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పరిస్థితి విషమంగా ఉందని పలు మీడియాల్లోనూ వార్తలు వెలువడుతున్నాయి. టెస్టు మ్యాచ్‌కు ఒకరోజు ముందు కేవలం 5 మంది ఆటగాళ్లు మాత్రమే ప్రాక్టీస్ సెషన్‌కు చేరుకున్నారు. అంటే జట్టు పరిస్థితి దారుణంగా తయారైంది. అనారోగ్యం కారణంగా ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రాలేకపోయారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏ వైరస్ బారిన పడ్డారనేది ఇంకా నిర్ధారించలేదు. ఇది కరోనా వైరస్ లేదా మరేదైనా అనేది కనుగొనే పనిలో పడ్డారు.

విశేషమేమిటంటే, డిసెంబర్ 1న రావల్పిండి వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. కాగా రెండో టెస్టు డిసెంబర్ 9 నుంచి ముల్తాన్‌లో జరగనుంది. అదే సమయంలో, మూడవ, చివరి మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి కరాచీలో జరుగుతుంది. అంతకుముందు సెప్టెంబర్ నెలలో ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..