Asia Cup 2025 : బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఆసియా కప్ బాయ్ కట్ చేయాలని డిమాండ్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ 2025లో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ షెడ్యూల్ చేయడంపై బీసీసీఐ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో #BoycottAsiaCup ట్రెండింగ్‌లో ఉంది, అభిమానులు మ్యాచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Asia Cup 2025 : బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్.. ఆసియా కప్ బాయ్ కట్ చేయాలని డిమాండ్
Bcci

Updated on: Jul 27, 2025 | 11:38 AM

Asia Cup 2025 : ఆసియా కప్ 2025 షెడ్యూల్ విడుదలైన తర్వాత బీసీసీఐ ఆన్‌లైన్‌లో భారీ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 14న యూఏఈలో భారత్, పాకిస్థాన్‌తో తలపడనుందని షెడ్యూల్ ప్రకటించడమే ఈ వివాదానికి కారణం. పహల్గాంలో జరిగిన దురదృష్టకర ఉగ్రదాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోయిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వచ్చింది. ఈ దాడికి నిరసనగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‎లో పాకిస్థాన్ ఛాంపియన్స్‎తో జరగాల్సిన మ్యాచ్ నుండి ఇండియా ఛాంపియన్స్ జట్టు తప్పుకున్న సంగతి తెలిసిందే.

అధికారిక టోర్నమెంట్‌లో భారత్, పాకిస్థాన్‌తో ఇంత త్వరగా ఆడటం చూసి క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విమర్శల వెల్లువ కురిసింది. చాలా మంది యూజర్లు బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇన్సెసిటివ్ అని అభివర్ణించారు. #BoycottAsiaCup అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. భారత క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్‌లో పాల్గొనడాన్ని పునరాలోచించుకోవాలని యూజర్లు డిమాండ్ చేశారు.

ఎక్స్‎లో చాలా మంది యూజర్లు బీసీసీఐ వాణిజ్య ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. “ఇది కేవలం క్రికెట్ మాత్రమే కాదు. మన ప్రజల కోసం నిలబడటం” అని ఒక యూజర్ రాశారు. ఈ వివాదం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు భారత్, పాకిస్థాన్ మధ్య క్రీడా సంబంధాలపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను మళ్లీ తెర మీదకు తెచ్చింది. క్రీడలు రాజకీయాల నుండి వేరుగా ఉండాలని కొందరు వాదిస్తున్నప్పటికీ, భారత అభిమానుల్లో ఎక్కువ మంది బహిష్కరణకు పిలుపునిచ్చారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మరో రెండు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున, భారత క్రికెట్ అధికారులపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. మరి బీసీసీఐ ఈ వ్యతిరేకతకు ఎలా స్పందిస్తుందో, మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..