Rohit Sharma 264: భారత ఓపెనర్ రోహిత్ శర్మ 2014లో ఈ రోజున శ్రీలంకతో జరిగిన వన్డేలో 264 పరుగులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నవంబర్ 13, 2014న వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఇప్పటికీ ఈ రికార్డు అజేయంగానే నిలిచింది. ఈ మేరకు బీసీసీఐ హిట్‌మ్యాన్ నాక్‌ను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. ఏడేళ్ల క్రితం భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టి డబుల్ సెంచరీతో ఈడెన్ గార్డెన్స్‌లో వెలుగులు నింపాడు. ఇది ఇప్పటి వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఏ బ్యాటర్‌కు అందని రికార్డుగా నిలిచిపోయింది. ‘హిట్‌మ్యాన్’గా పేరుగాంచిన రోహిత్, వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 219 పరుగులను అధిగమించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్లతో సూపర్ నాక్ ఆడాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ పలు రికార్డులు సాధించాడు.
ఈ మ్యాచులో భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 404 పరుగుల భారీ స్కోర్‌ను సాధిచింది. అనంతరం శ్రీలంక 251 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నాలుగో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ నమోదు చేసిన మొదటి బ్యాటర్‌గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఈ వారం ప్రారంభంలో, రోహిత్ భారత టీ20ఐ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లీ తరువాత టీ20ఐలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు.
న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, వెంకటేష్ అయ్యర్, అవేష్ ఖాన్, అక్షర్ పటేల్ కూడా న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు జట్టులో చోటు దక్కించుకున్నారు. మొదట న్యూజిలాండ్‌తో టీ20ఐ సిరీస్‌ని ఆడుతుంది. ఆ తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇరుజట్లు తలపడనున్నాయి. నవంబర్ 17న జైపూర్, 19న రాంచీ, నవంబర్ 21న కోల్‌కతాలో మూడు టీ20లు జరుగుతాయి. అనంతరం రెండు టెస్టులు కాన్పూర్ (నవంబర్ 25-29), ముంబై (డిసెంబర్ 3-7)లో జరుగుతాయి.
2⃣6⃣4⃣ Runs
1⃣7⃣3⃣ Balls
3⃣3⃣ Fours
9⃣ Sixes#OnThisDay in 2014, @ImRo45 set the stage on fire ? ? & registered the highest individual score in the ODIs. ? ? #TeamIndiaLet’s revisit that sensational knock ? ?
— BCCI (@BCCI) November 13, 2021
On this day in 2014 @ImRo45 scored 264 Runs in 173 balls
Highest individual score in ODI
Most no of 4s in an ODI innings – 33 Sixes – 9#RohitSharma pic.twitter.com/yck2fG4UH9
— VIPER (@Rohit4everr) November 13, 2021