Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో సూపర్బ్ క్యాచ్.. చూశారంటే షాకే.. వైరల్ వీడియో

|

Mar 20, 2022 | 11:56 AM

ఇంగ్లండ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మొత్తం 48.5 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్ 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Watch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో సూపర్బ్ క్యాచ్.. చూశారంటే షాకే.. వైరల్ వీడియో
Nz Vs Eng, Women's World Cup 2022
Follow us on

ఇంగ్లండ్(England) కెప్టెన్ హీథర్ నైట్(Heather Knight) ఒకచేత్తో క్యాచ్ పట్టి, న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చింది. దీంతో కివీస్ బ్యాట్స్ మెన్ ఖాతా తెరవడం కష్టంగా మారింది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2022(ICC Women’s World Cup 2022) మ్యాచ్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడిన మ్యాచులో ఈ దృశ్యం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ ఇన్నింగ్స్ సమయంలో, ఇంగ్లండ్ కెప్టెన్ అలాంటి ఓ ఫీట్ చేసి చూపించింది. ఆ తర్వాత అందరూ షాక్ అయ్యారు.

ఈ క్యాచ్ చూసి తోటి ఆటగాళ్లు, బ్యాట్స్‌మెన్ అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. కివీస్ బ్యాటర్‌కు ఏం అర్థం కాకముందే ఇంగ్లండ్ కెప్టెన్ తన పనిని పూర్తి చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లీ తహుహును పెవిలియన్ చేర్చడంలో అద్భుతంమైన స్క్రిప్ట్ రాసింది.

ఒంటి చేత్తో న్యూజిలాండ్ బ్యాటర్ ఆట ముగించింది..

లీ తహుహు అప్పుడే క్రీజులోకి వచ్చింది. కానీ, ఆమె పిచ్‌ను కూడా అర్థం చేసుకోకముందే, ఇంగ్లండ్ కెప్టెన్ ఆమె ఆట ముగిసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి ఇదే జరిగింది. సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్ చేస్తోంది. తన ఓవర్ రెండో బంతికి లీ తహుహు భారీ షాట్‌కు ప్రయత్నించింది. బంతి గాలిలోకి లేచింది. బంతి ఇంగ్లండ్ కెప్టెన్‌కు కూడా చాలా దూరంగా వెళ్తోంది. కానీ, హీథర్ నైట్ గాలిలో దూకి ఒంటి చేత్తో బంతిని పట్టుకుని ఆశ్చర్యపరిచింది. దీంతో అంతా షాకయ్యారు.

న్యూజిలాండ్ జట్టు 203 పరుగులకే ఆలౌటైంది..

ఇంగ్లండ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మొత్తం 48.5 ఓవర్లలో 203 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్ 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌పై పరుగుల వేటలో ఇంగ్లండ్ కెప్టెన్ బ్యాట్‌తో 42 పరుగులు చేసింది. జట్టు స్కోరు 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఆమె 23వ ఓవర్లో పెవిలియన్ చేరింది.

అంతకుముందు, న్యూజిలాండ్ తరపున మ్యాడీ గ్రీన్ అత్యధికంగా 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఆమె తప్ప కివీస్ బ్యాట్స్‌మెన్ పెద్దగా స్కోర్ చేయలేదు. కెప్టెన్ సోఫీ డివైన్ 41 పరుగులు చేసి జట్టులో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

Also Read: Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..

Women’s World Cup 2022: ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ విజయం.. సెమీస్ రేసు నుంచి కివీస్ ఔట్..