ICC Player Of Month: సెంచరీలతో సత్తా చాటారు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌కు నామినేట్‌ అయ్యారు.. లిస్టులో ఎవరెవరున్నారంటే..

ICC Player Of Month Nominations: ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మాజీ కెప్టెన్‌ రూట్‌ (Joe Root ) 396 పరుగులు సాధించగా,

ICC Player Of Month: సెంచరీలతో సత్తా చాటారు.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌కు నామినేట్‌ అయ్యారు.. లిస్టులో ఎవరెవరున్నారంటే..
Icc Awards

Updated on: Jul 05, 2022 | 12:07 PM

ICC Player Of Month Nominations: ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జానీ బెయిర్‌ స్టో, జో రూట్‌ అదరగొట్టారు. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా మాజీ కెప్టెన్‌ రూట్‌ (Joe Root ) 396 పరుగులు సాధించగా, బెయిర్‌ స్టో (Jonny Bairstow) ఏకంగా 394 రన్స్‌ సాధించాడు. తద్వారా కివీస్‌పై 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే సిరీస్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారెల్‌ మిచెల్‌ (Daryl Mitchell) అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచరులు విఫలమైనా ఒంటరి పోరాటం చేశాడు. 538 పరుగులు చేసి సిరీస్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా మూడు సెంచరీలు, రెండు ఆర్ధ సెంచరీలు ఉండడం విశేషం. ఇలా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఈ ఆటగాళ్లు ప్లేయర్‌ ఆఫ్‌ మంత్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. జూన్‌ నెలకు గాను ఐసీసీ నామినేట్‌ చేసిన ఆటగాళ్లలో ఈ ముగ్గురికి చోటు దక్కింది.

మహిళల జాబితాలో..

ఇక మహిళల విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాకు చెందిన షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, మారిజానే కాప్‌తో పాటు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ నాట్ స్కివర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ నామినేషన్స్‌ లో నిలిచారు. ఇక స్వదేశంలో భారతజట్టుతో జరుగుతున్న రీషెడ్యూల్‌ టెస్ట్‌లోనూ రూట్‌, బెయిర్ స్టో రాణించారు. మొదటి ఇన్నింగ్స్ లో బెయిర్‌ స్టో సెంచరీతో సత్తా చాటగా, రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌ లో విఫలమైన రూట్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నాడు. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..