Sara Tendulkar: ఈసారి ఐపీఎల్‌లో సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ బరిలోకి దిగబోతున్నాడు. గురువారం చెన్నైలో జరిగిన వేలంలో అర్జున్ టెండుల్కర్‌ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అయితే, ఈ విషయంపై స్పందించిన అర్జున్ సోదరి, సచిన్ కుమార్తె సారా టెండుల్కర్ తన సోదరుడిని అభినందించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అర్జున్ బౌలింగ్ చేస్తున్న ఫొటోను షేర్ చేసి ఎమోషనల్ కామెంట్ చేసింది.
‘ క్రికెట్ అనేది తన రక్తంలోనే ఉంది. నువ్వు సాధించిన ఈ ఘనతను.. నీ నుంచి ఎవరూ దూరంచేయలేరు. ఇన్నాళ్లూ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసి ఉన్నతమైన క్రికెటర్‌గా మారాడు. ఇప్పుడిక 22 గజాలపై తుఫాన్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు’ అని సారా రాసుకొచ్చింది.
అర్జున్ లెఫ్టార్మ్ పేసర్, బ్యాట్స్‌మన్ అయినందున తమకు బాగా ఉపయోగపడాతాడని అతన్ని జట్టులోకి తీసుకున్నామని ఆ ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ తెలిపారు. అర్జున్ ఇటీవల ముంబై సీనియర్స్ జట్టు తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడారు.
Also Read:
ఐడియా అదుర్స్.. మొక్కజొన్న పంటను కాపాడుకోడానికి రైతన్నల క్రేజీ ప్లాన్స్.. ఏం చేస్తున్నారంటే..