ధావన్ ట్వీట్‌కు..ప్రధాని రీట్వీట్

ఢిల్లీ: గాయం కారణంగా వరల్డ్ కప్  మధ్యలోనే దూరం కావడం పట్ల టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ చాలా బాధపడుతోన్నాడు. ప్రపంచకప్‌లో ఇకపై భాగస్వామిని కాలోకపోతున్నానంటూ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. తనపై ప్రేమను కురిపించిన జట్టు సహచరులు, క్రికెట్‌ ప్రేమికులు, అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రియమైన శిఖర్ ధావన్‌, పిచ్‌ నిన్ను మిస్సవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత త్వరగా నువ్వు కోలుకుంటావని ఆశిస్తున్నా. […]

ధావన్ ట్వీట్‌కు..ప్రధాని రీట్వీట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 21, 2019 | 7:59 PM

ఢిల్లీ: గాయం కారణంగా వరల్డ్ కప్  మధ్యలోనే దూరం కావడం పట్ల టీమిండియా ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ చాలా బాధపడుతోన్నాడు. ప్రపంచకప్‌లో ఇకపై భాగస్వామిని కాలోకపోతున్నానంటూ తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. తనపై ప్రేమను కురిపించిన జట్టు సహచరులు, క్రికెట్‌ ప్రేమికులు, అభిమానులకు థాంక్స్ చెప్పాడు. ఈ ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందించారు.

‘ప్రియమైన శిఖర్ ధావన్‌, పిచ్‌ నిన్ను మిస్సవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధ్యమైనంత త్వరగా నువ్వు కోలుకుంటావని ఆశిస్తున్నా. తిరిగి మైదానంలో ప్రవేశించి దేశానికి మరిన్ని విజయాలు అందిగలవన్న విశ్వాసం ఉంది’ అని మోదీ తన వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో ధావన్ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ వేలికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్నా అలాగే బ్యాటింగ్‌ చేసి శతకం సాధించాడు. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. స్కానింగ్‌ చేయించడంతో వేలిలో చీలిక ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మొదట మూడు మ్యాచ్‌లకు దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా ఆశించినంత వేగంగా గబ్బర్‌ కోలుకోకపోవడంతో మెగా టోర్నీని మధ్యలోనే వీడాల్సి వచ్చింది. అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌కు చోటు దక్కింది.