వరల్డ్ కప్ 2019: విండీస్ నిలవాలంటే..గెలవాల్సిందే

మాంచెస్టర్‌: వరల్డ్ కప్‌లో ప్రస్తుతం వెస్టిండీస్ గడ్డ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నిలకడలేమి ఆటతో జట్టు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్‌ టోర్నీలో నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయగా తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా ఆ జట్టు ప్రస్తుతం మూడు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూజిలాండ్‌తో జరగబోయే […]

  • Ram Naramaneni
  • Publish Date - 7:18 pm, Fri, 21 June 19
వరల్డ్ కప్ 2019: విండీస్ నిలవాలంటే..గెలవాల్సిందే

మాంచెస్టర్‌: వరల్డ్ కప్‌లో ప్రస్తుతం వెస్టిండీస్ గడ్డ పరిస్థితులను ఎదుర్కొంటుంది. నిలకడలేమి ఆటతో జట్టు ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్‌ టోర్నీలో నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విండీస్‌ ఆడిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయగా తర్వాత ఆడిన మూడు మ్యాచ్‌ల్లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా ఆ జట్టు ప్రస్తుతం మూడు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌ ఆ జట్టుకు కీలకంగా మారింది.

మరోవైపు న్యూజిలాండ్‌ మంచి ఫామ్‌లో దూసుకుపోతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో సెకండ్ ఫ్లేస్‌లో నిలిచింది. భారత్‌తో మ్యాచ్‌ రద్దవడం మినహాయిస్తే మిగతా నాలుగు వన్డేలు గెలిచింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆ జట్టు ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది.