Ranji Trophy : రంజీ ట్రోఫీలో విచిత్రం.. క్యాచ్ లేదు, స్టంప్ లేదు, LBW కాదు..అయినా బ్యాట్స్‌మెన్ ఎలా అవుటయ్యాడు?

క్రికెట్ చరిత్రలో క్యాచ్, స్టంపింగ్, ఎల్‌బీడబ్ల్యూ లేదా రనౌట్ రూపంలో బ్యాట్స్‌మెన్ అవుట్ అవ్వడం మనం చూశాం. కానీ రంజీ ట్రోఫీలో మేఘాలయ, మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన, వివాదాస్పద అవుట్ జరిగింది. మణిపూర్‌కు చెందిన ఆటగాడు లంబం అజయ్ సింగ్‌ను అంపైర్ చాలా అసాధారణమైన రీతిలో అవుట్ ఇచ్చాడు.

Ranji Trophy : రంజీ ట్రోఫీలో విచిత్రం.. క్యాచ్ లేదు, స్టంప్ లేదు, LBW కాదు..అయినా బ్యాట్స్‌మెన్ ఎలా అవుటయ్యాడు?
Ranji Trophy

Updated on: Nov 19, 2025 | 5:19 PM

Ranji Trophy : క్రికెట్ చరిత్రలో క్యాచ్, స్టంపింగ్, ఎల్‌బీడబ్ల్యూ లేదా రనౌట్ రూపంలో బ్యాట్స్‌మెన్ అవుట్ అవ్వడం మనం చూశాం. కానీ రంజీ ట్రోఫీలో మేఘాలయ, మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక అరుదైన, వివాదాస్పద అవుట్ జరిగింది. మణిపూర్‌కు చెందిన ఆటగాడు లంబం అజయ్ సింగ్‌ను అంపైర్ చాలా అసాధారణమైన రీతిలో అవుట్ ఇచ్చాడు. దీనికి కారణం అతను బంతిని రెండుసార్లు బ్యాట్‌తో కొట్టడం. ఈ అవుట్ ఇప్పుడు క్రీడా వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

మేఘాలయ బౌలర్ ఆర్యన్ బోరా వేసిన బంతిని లంబం అజయ్ సింగ్ డిఫెన్స్ చేశాడు. డిఫెన్స్ చేసిన తర్వాత బంతి నెమ్మదిగా వికెట్ల వైపు వెళ్లడం ప్రారంభించింది. బంతి వికెట్లకు తగలకుండా ఆపడం కోసం లంబం అజయ్ సింగ్ మళ్లీ బ్యాట్‌తో దానిని ఆపేశాడు. ఈ అవుట్ గురించి మ్యాచ్‌లో ఉన్న కొందరు అధికారులు మాట్లాడుతూ.. బంతి వికెట్ల వైపు వెళ్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ దాన్ని ప్యాడ్‌తో దూరంగా నెట్టేయవచ్చని, కానీ బ్యాట్‌తో రెండవసారి ఆపడం వలన అంపైర్ ధర్మేశ్ భరద్వాజ్ బంతిని రెండుసార్లు కొట్టడం అనే నిబంధన ప్రకారం అవుట్‌గా ప్రకటించారని తెలిపారు. మేఘాలయ టీమ్ అప్పీల్ చేయగానే, అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించకుండా బ్యాట్స్‌మెన్ వెంటనే పెవిలియన్‌కు వెళ్ళిపోయాడు.

ఐసీసీ నిబంధన ఏమి చెబుతుంది?

ఈ వివాదాస్పద అవుట్‌కు కారణమైన నిబంధన ఎంసీసీ చట్టం 34.1.1. ప్రకారం.. “బంతి ఆటలో ఉన్నప్పుడు స్ట్రైకర్‌కు చెందిన బ్యాట్, శరీరం లేదా ఏదైనా భాగానికి తగిలిన తర్వాత స్ట్రైకర్ ఉద్దేశపూర్వకంగా బ్యాట్‌తో లేదా తన శరీరంలోని ఏదైనా భాగంతో (బ్యాట్ పట్టుకోని చేయి తప్ప) బంతిని రెండవసారి కొడితే లేదా తాకితే అవుట్ అవుతాడు.”

ఈ నిబంధనకు ఒకే ఒక మినహాయింపు ఉంది.. అదేంటంటే “వికెట్‌ను కాపాడుకోవడం కోసం రెండవసారి బంతిని కొట్టినట్లయితే తప్ప మిగిలిన ఏ సందర్భంలోనైనా అవుటే అవుతారు. అంటే వికెట్లకు తగలకుండా కేవలం కాపాడుకోవడం కోసం మాత్రమే రెండవసారి కొట్టడానికి అనుమతి ఉంది. ఈ కేసులో బంతి వికెట్ల వైపు వెళ్తున్నప్పుడు కూడా బ్యాట్‌తో కొట్టడం ఉద్దేశపూర్వక చర్యగా అంపైర్ భావించారు.

20 ఏళ్ల తర్వాత రంజీలో అవుట్

రంజీ ట్రోఫీ చరిత్రలో ఇలాంటి అవుట్ జరగడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ తరహా అవుట్ నమోదైంది. గతంలో 2005-06 సీజన్‌లో జార్ఖండ్‌పై జమ్మూ-కాశ్మీర్ కెప్టెన్ ధ్రువ్ మహాజన్ కూడా సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. అంతకుముందు కూడా రంజీ ట్రోఫీలో మూడుసార్లు ఇలాంటి అవుట్ నమోదైంది. 1998-99లో తమిళనాడుకు చెందిన ఆనంద్ జార్జ్, 1986-87లో జమ్మూ-కాశ్మీర్ తరపున షాహిద్ పర్వేజ్, 1963-64లో ఆంధ్రకు చెందిన కేకే బవన్నా ఈ విధంగా అవుటయ్యారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us