
ఆఫ్ఘనిస్థాన్‌తో శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్, మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నాడు. మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు నితీష్. అయితే ప్రెస్ మీట్ మధ్యలో నితీష్‌కు వాళ్ల అమ్మ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. సాధారణంగా ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ తర్వాత, ఎదురుగా పదుల సంఖ్యలో రిపోర్టర్లు ఉన్నప్పుడు, ఏ ఫోన్ వచ్చినా స్పందించరు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలపైనే దృష్టి పెడతారు.
కానీ, అక్కడ ఫోన్ చేస్తోంది అమ్మ. ఆమె కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ చెప్పండి. నితీష్ కూడా ఇదే ఫీలై ఉంటాడు. ప్రెస్ మీట్ మధ్యలో.. ఒక్క నిమిషం అంటూ.. అమ్మ కాల్ లిఫ్ట్ చేసి.. ‘అమ్మ నేను మళ్లీ చేస్తాను.. ఒక 5 నిమిషాల్లోనే నేను కాల్ చేస్తాను’ అంటూ సమాధానం చెప్పి పెట్టేశాడు. ప్రెస్ మీట్ మధ్యలో కాల్ లిఫ్ట్ చేసినందుకు మీడియా వాళ్లకు సారీ చెప్పినప్పటికీ.. అమ్మ కంగారు పడొద్దని, ముందు ఫోన్ లిఫ్ట్ చేసి, తర్వాత చేస్తాను అని చాలా క్యూట్‌గా చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అమ్మంటే నీకు ఎంత ప్రేమ బ్రో.. మన హృదయాలు గెలుచుకున్నావ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.
The post-match presser can wait but a call from Mom simply cannot 😊#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank | @NKReddy07 pic.twitter.com/23OUBNZvYH
— BCCI (@BCCI) June 13, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి