SRH Vs LSG: స్వీట్ రివెంజ్ అదిరిందిగా.! పూరన్ దెబ్బ కావ్య పాప అబ్బా.. నెటిజన్లు ఏమన్నారంటే.?

|

Mar 28, 2025 | 11:12 AM

సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో తొలి ఓటమి ఎదుర్కుంది. తన సొంత మెడిసిన్‌ను లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ టేస్ట్ చేయించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మరి ఆ మ్యాచ్ ఏంటి.? ఎంత స్కోర్ చేశాడు.? ఇప్పుడు తెలుసుకుందామా..

SRH Vs LSG: స్వీట్ రివెంజ్ అదిరిందిగా.! పూరన్ దెబ్బ కావ్య పాప అబ్బా.. నెటిజన్లు ఏమన్నారంటే.?
Srh Vs Lsg
Follow us on

రాజస్థాన్ రాయల్స్‌పై విజయభేరి మోగించిన తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ విజయం సాధిస్తుందని అందరూ భావించారు. అయితే గురువారం హైదరాబాద్‌లో లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభావాన్ని ఎదుర్కుంది కమిన్స్ జట్టు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన SRH కేవలం 190 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ టార్గెట్‌ను LSG కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించింది. ఒకప్పుడు కావ్య మారన్ చేతిలో లేఆఫ్స్ ఎదుర్కున్న బ్యాటర్ ఇప్పుడు హైదరాబాద్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ బ్యాట్స్‌మెన్ మరెవరో కాదు నికోలస్ పూరన్. అతడి తుఫాను ఇన్నింగ్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్‌కు కన్నీటిని తెప్పించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా

లక్ష్యచేధనలో 191 పరుగుల టార్గెట్‌ను సన్‌రైజర్స్ బౌలర్లు అడ్డుకోగలరని అటు ఆ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. కానీ నికోలస్ పూరన్ SRH ఆశలను అడియాశలుగా మార్చాడు. రెండో ఓవర్‌ నుంచి పూరన్ సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. అతడి దూకుడైన బ్యాటింగ్‌కు స్టేడియంలోని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్‌తో పాటు కావ్య మారన్ కూడా నిరాశ చెందారు. తమ జట్టు ఓడిపోవడం చూసి బాధపడింది కావ్య మారన్. చాలామంది అభిమానులు ఆమె ఫోటోలను ట్విట్టర్ వేదికగా వైరల్ చేశారు.

పూరన్ ‘ప్రతీకారం’..

నిజానికి, నికోలస్ పూరన్ 2019లో పంజాబ్ కింగ్స్ తరపున తన IPL అరంగేట్రం చేశాడు. 3 సీజన్లు ఆడిన తర్వాత, కావ్య మారన్ 2022 సీజన్‌లో 10.75 కోట్ల ధరకు అతన్ని తన జట్టులో చేర్చుకుంది. SRH తరపున పూరన్ 14 మ్యాచ్‌ల్లో 144 స్ట్రైక్ రేట్‌తో 306 పరుగులు చేశాడు. మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. 2023 సీజన్‌లో విడుదల చేసింది. ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్‌ను అధిక ధర ఇచ్చి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వైస్ కెప్టెన్‌గా మారాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్‌పై కేవలం 26 బంతుల్లో 269 స్ట్రైక్ రేట్‌తో 70 పరుగులు చేసి తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు.

ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా