PAK vs NZ T20 World Cup 2022 Live Score: టీ20 ప్రపంచ కప్ 2022 లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీఫైనల్లో 153 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పాకిస్థాన్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2009లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
ఇరుజట్లు:
పాకిస్థాన్ ప్లేయింగ్ XI: మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. బుధవారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన సెమీఫైనల్లో 153 పరుగుల లక్ష్యాన్ని చేధించిన పాకిస్థాన్.. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. 13 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఫైనల్‌కు చేరుకుంది. 2007లో ఆడిన తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరినా విజయం సాధించలేకపోయింది. చివరిసారిగా 2009లో ఆడిన టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరి టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. బాబర్ 43, రిజ్వాన్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు.
6 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. బాబర్ 25, రిజ్వాన్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో పాక్ ఓపెనర్ల మధ్య హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతోపాటు, పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ నమోదైంది.
3 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ టీం వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. బాబర్ 7, రిజ్వాన్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య తొలి సెమీఫైనల్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందు 153 పరుగుల టార్గెట్ ఉంది.
18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. మిచెల్ 46, జేమ్స్ నిషమ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
14 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 3 వికెట్లు కోల్పోయి 99పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 37, మిచెల్ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. కెప్టెన్ విలియమ్సన్ (24), డెరిల్ మిచెల్ (13) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 73/3.
కివీస్ కు మరో షాక్ తగిలింది. 49 పరుగుల వద్ద ఆ జట్టు ఇన్ ఫాం బ్యాటర్ ఫిలిప్స్ (6) ఔటయ్యాడు. నవాజ్ కు ఈ వికెట్ దక్కింది. 8 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 49/3
న్యూజిలాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ జట్టు వన్ డౌన్ బ్యాటర్ డేవిడ్ కాన్వే (21) రనౌట్ అయ్యాడు. 7.2 ఓవర్లు ముగిసే సరికి కివీస్ స్కోరు 45/2.
మూడు ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం ఒక వికెట్ కోల్పోయి 19 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ 5, డేవాన్ కాన్వే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ టీంకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలోలేని షాహీన్ అఫ్రిది మొదటి ఓవర్‌లోనే కివీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. దీంతో మూడో బంతికే కివీస్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. ఫిన్ అలెన్(4) ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), కేన్ విలియమ్సన్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
మహ్మద్ రిజ్వాన్(కీపర్), బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది
తొలి సెమీస్‌లో తలపడేందుకు న్యూజిలాండ్, కివీస్ జట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ జట్టు బౌలింగ్ చేయనుంది.
ఇక్కడ జరిగిన 7 మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఫలితాలు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే అనుకూలంగా వచ్చాయి. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసినా.. భారీ స్కోర్ చేస్తే విజయం వరించే అవకాశం ఉంది.
గతంలో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడినప్పుడల్లా విజయం సాధించిన చరిత్ర పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంది. 1992, 1999 ODI ప్రపంచ కప్, 2007 టీ20 ప్రపంచ కప్‌ల సెమీ-ఫైనల్స్‌లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది.
1992 ODI ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకోలేకపోయినందున ఈ మ్యాచ్‌తో చరిత్రను పునరావృతం చేసినట్లు కనిపిస్తోంది. అక్కడ వారు న్యూజిలాండ్‌ను ఓడించి చివరకు టైటిల్‌ను గెలుచుకున్నారు. పాకిస్థాన్ అభిమానులు మరోసారి అదే ఆశతో ఎదురుచూస్తున్నారు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా అవతరిస్తుంది. గ్రూప్ 1లో న్యూజిలాండ్ జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రూప్ 2లో పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.