ENG vs NZ, T20 World Cup 2021: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు జోస్ బట్లర్ 29, జానీ బెయిర్‌స్టో 13 తక్కువ పరుగులు చేసి పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్, అలీ కీలక భాగస్వామ్యాన్ని అందించి ఇంగ్లండ్ టీం పోరాడే స్కోర్‌ను సాధించేందుకు తమ వంతు సహాయపడ్డారు. ఇద్దరూ కలిసి అర్థసెంచరీ భాగస్వామ్యం అందించారు. అనంతరం మలాన్ (42 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, సిక్స్) అర్థ సెంచరీకి 8 పరుగుల దూరంలో ఇష్ సోధి బౌలింగ్‌లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొయిన్ అలీ 51(37 బంతులు, 3 ఫోర్లు, 2 సిక్సులు) అర్థ సెంచరీతో ఇంగ్లండ్ టీం భారీ స్కోర్ చేసేందుకు తోడ్పాడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ, మిల్నే, సొధి, నీషం తలో వికెట్ పడగొట్టారు.
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్
England’s innings comes to an end at 166/4 ?
Will the @BLACKCAPS chase this down? #T20WorldCup | #ENGvNZ | https://t.co/zBjgVLo3T5 pic.twitter.com/Xayojj3A7H
— ICC (@ICC) November 10, 2021
Also Read: