World Cup 2023: కేన్‌ మామ వచ్చేశాడుగా.. ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగనున్న న్యూజిలాండ్‌ జట్టు ఇదే..

భారతదేశంలో అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఐసీపీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు . అనూహ్యంగా ఐపీఎల్‌ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్‌ విలియమ్స్‌న్‌ కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. గత ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు మోకాలి గాయానికి గురైన కేన్ విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు

World Cup 2023: కేన్‌ మామ వచ్చేశాడుగా.. ప్రపంచకప్‌ కోసం బరిలోకి దిగనున్న న్యూజిలాండ్‌ జట్టు ఇదే..
New Zealand Cricket Team

Updated on: Sep 11, 2023 | 1:39 PM

భారతదేశంలో అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఐసీపీ వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన న్యూజిలాండ్ జట్టును ప్రకటించారు . అనూహ్యంగా ఐపీఎల్‌ లో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్‌ విలియమ్స్‌న్‌ కే సారథ్య బాధ్యతలు అప్పగించారు. గత ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు మోకాలి గాయానికి గురైన కేన్ విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. విలియమ్సన్ ఎప్పుడు ఆడేందుకు ఫిట్‌గా ఉంటాడో ఇంకా తెలియలేదు. అయినప్పటికీ న్యూజిలాండ్ క్రికెట్‌ సెలెక్టర్లు కేన్‌మామ పైనే నమ్మకముంచారు. కాగా విలియమ్సన్‌కి ఇది నాలుగో ప్రపంచకప్‌ కావడంతో ఈసారి రిటైర్‌మెంట్‌ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకుని ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కూడా చోటు దక్కించుకున్నాడు. అతనికి కూడా ఇది నాలుగో ప్రపంచకప్ .ఇక స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్లు రచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్ తొలిసారిగా 50 ఓవర్ల ప్రపంచకప్‌లో ఆడనున్నారు. ఈ టోర్నీలో కివీస్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ గా టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీలు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే లాకీ ఫెర్గూసన్, జిమ్మీ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి కూడా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో స్థాన సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆల్‌ రౌండర్‌ నీషమ్, ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో లేకపోయినా న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. కాగా అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది న్యూజిలాండ్‌. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబర్‌ 29న ఈ మ్యాచ్‌ జరగనుంది.

వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదే..

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.

ఇవి కూడా చదవండి

 కుటుంబ సభ్యులతో వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ మెంట్

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..