టైటిల్ చూసి షాకవుతున్నారా.? ఏంటి.! టీ20 మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడాల్సింది పోయి.. 49 బంతుల్లో కేవలం 8 పరుగులే చేశారా.? అని ఆశ్చర్యపోతున్నారా.! కూల్.. కూల్.. టెన్షన్ వద్దు.. మీరు అనుకుంటున్న దానిలో ఒక చిన్న తప్పు ఉంది.. ఆ స్కోర్ చేసింది ఓ ఆటగాడు కాదు.. ఒక జట్టు.. ఇదేం స్థానికంగా జరిగిన టోర్నమెంట్‌లో నమోదైన స్కోర్ కాదండోయ్.. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో నమోదైంది. ఇక ఇప్పుడు ఇదే టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు.. ఆ విశేషాలు తెలుసుకుందాం..
టీ20 క్రికెట్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. ఆ రికార్డును నేపాల్ మహిళల అండర్ 19 జట్టు తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో నేపాల్ మహిళల జట్టు కేవలం 8 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈతో జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు 8.1 ఓవర్లలో 8 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఒక్కరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. వెంటవెంటనే పెవిలియన్ చేరారు. స్నేహ మహారా(3) జట్టులో టాప్ స్కోరర్ కాగా.. 6గురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం.
ఇక యూఏఈ బౌలర్లలో మహికా గౌర్ తన స్పిన్ మాయాజాలంలో 5 వికెట్లు పడగొట్టింది. తన కోటాలో 4 ఓవర్లు వేసిన మహికా.. కేవలం 2 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మరో యూఏఈ బౌలర్ ఇందూజా 3 వికెట్లు తీసింది. ఇక స్వల్ప లక్ష్యచేధనను యూఏఈ కేవలం 1.1 ఓవర్లలో 10 వికెట్లతో ముగించింది.