Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

IPL 2025 Best Playing XI: ఐపీఎల్ 2025 అత్యుత్తమ జట్టులో నవజ్యోత్ సింగ్ సిద్ధు మొత్తం ఏడుగురు భారతీయ ఆటగాళ్లకు స్థానం కల్పించారు. రోహిత్ శర్మతో పాటు, విరాట్ కోహ్లీకి స్థానం కల్పించాడు. ఈ ప్లేయింగ్-11లో కేఎల్ రాహుల్‌కు మాత్రం స్థానం దక్కలేదు.

IPL 2025 అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ..
Rohit Sharma Mi
Follow us
Venkata Chari

|

Updated on: Jun 09, 2025 | 9:45 PM

IPL 2025 Playing XI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకుంది. ఆ తర్వాత ఇప్పుడు భారత జట్టు మాజీ అనుభవజ్ఞుడైన ఆటగాడు ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ప్లేయింగ్-11ని ప్రకటించాడు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో పాటు, జోస్ బట్లర్‌కు వికెట్ కీపింగ్ బాధ్యత అప్పగించాడు. ఈ ప్లేయింగ్-11లో కేఎల్ రాహుల్‌కు మాత్రం స్థానం దక్కలేదు.

IPL 2025 బెస్ట్ ప్లేయింగ్-11 ప్రకటన.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

ఐపీఎల్ 2025 రూపంలో ఆర్‌సీబీ ఎట్టకేలకు తన తొలి టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత జట్టు మాజీ అనుభవజ్ఞుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ప్లేయింగ్-11ని ప్రకటించాడు. ఈ అనుభవజ్ఞుడు రోహిత్ శర్మను జట్టుకు కెప్టెన్‌గా చేశాడు. హిట్‌మాన్ ఈ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కూడా లేడు. కానీ, అతను జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నాడు.

రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించడంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, “రోహిత్ శర్మ కెప్టెన్, ముంబై రాజు. ఐదు ఐపీఎల్ ట్రోఫీలు, ఒక ఐసీసీ ప్రపంచ కప్, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ, అంటే ఈ వ్యక్తి చేయనిది ఏమీ లేదు. రెండవది, 7000 పరుగులు. రోహిత్ 50 పరుగులు చేసినప్పుడు, జట్టు ఎప్పుడు ఓడిపోదని నమ్మకంగా ఉండేది. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా అంగీకరించడం కష్టమే” అని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మను కెప్టెన్‌గా చేసినందుకు సిద్ధూను ట్రోల్ చేసిన నెటిజన్లు..

IPL 2025 లో రోహిత్ శర్మ బ్యాట్ నిశ్శబ్దంగా కనిపించింది. కొన్ని మ్యాచ్‌లలో అతను ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులో కూడా చేరాడు. ఈ IPL 2025 లో, రోహిత్ శర్మ 14 మ్యాచ్‌లలో 418 పరుగులు చేశాడు. ఇందులో అతను 4 హాఫ్ సెంచరీలు చేశాడు. కానీ, హిట్‌మ్యాన్‌ను కెప్టెన్‌గా చేసినందుకు అభిమానులు అతనిని తీవ్రంగా ట్రోల్ చేశారు. అభిమానులు సోషల్ మీడియాలో సింధును ట్యాగ్ చేసి, అతను కామెడీ చేస్తున్నాడని రాసుకొచ్చారు.

సిద్ధూ జట్టులో ఏడుగురు భారతీయ ఆటగాళ్లు..

ఐపీఎల్ 2025 అత్యుత్తమ జట్టులో నవజ్యోత్ సింగ్ సిద్ధు మొత్తం ఏడుగురు భారతీయ ఆటగాళ్లకు స్థానం కల్పించారు. రోహిత్ శర్మతో పాటు, విరాట్ కోహ్లీకి స్థానం కల్పించాడు. దీంతో పాటు, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం లభించింది. అదే సమయంలో, జోస్ బట్లర్, నికోలస్ పూరన్, నూర్ అహ్మద్, జోష్ హాజిల్‌వుడ్ విదేశీ ఆటగాళ్లుగా స్థానం పొందారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఉత్తమ ఐపీఎల్ 2025 జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, నికోలస్ పూరన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, నూర్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
టెస్టు క్రికెట్‌లో ఒక్కసారి కూడా రనౌట్ కాలే.. టాప్ 5లో మనోడు
టెస్టు క్రికెట్‌లో ఒక్కసారి కూడా రనౌట్ కాలే.. టాప్ 5లో మనోడు
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే..
స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే..
ఇట్స్ అమేజింగ్.. మెట్లు ఎక్కడం వల్ల క్రియేటివ్‌గా ఆలోచిస్తారట..
ఇట్స్ అమేజింగ్.. మెట్లు ఎక్కడం వల్ల క్రియేటివ్‌గా ఆలోచిస్తారట..
ఒకే కుటుంబంలో 12మంది పిల్లలకు తల్లికి వందనం.. ఎంత డబ్బు వచ్చిందంట
ఒకే కుటుంబంలో 12మంది పిల్లలకు తల్లికి వందనం.. ఎంత డబ్బు వచ్చిందంట
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టర్కీ రియాక్షన్‌.. ఏమన్నాదంటే?
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టర్కీ రియాక్షన్‌.. ఏమన్నాదంటే?
దేశీయ క్రికెట్‌ రూపు మార్చిన BCCI.. కొత్త నిబంధనలతో మరింత కొత్తగా
దేశీయ క్రికెట్‌ రూపు మార్చిన BCCI.. కొత్త నిబంధనలతో మరింత కొత్తగా
తిరువనంతపురంలో యూకే ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..
తిరువనంతపురంలో యూకే ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..